కొందరిని బాధలు, కష్టాలు అప్పుడప్పుడు పలకరిస్తాయి. కానీ కొందరు మాత్రం నిరంతరం వాటిమధ్యే ఉంటారు. ఒకదాని తర్వాత మరొకటి వారిని చుట్టుముడతూనే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్.కెనెడీ కుటుంబం పరిస్థితి అదే. తరాలు మారుతున్నా వారి తలరాతలు మారడం లేదు. జాన్ కెనెడీ, ఆయన సోదరుడు సెనెటర్ రాబర్ట్ కెనెడీలను దుండగులు కాల్చి చంపారు. వారి సోదరుడు జోసెఫ్ కెనడీ రెండు ప్రపంచ యుద్ధంలో మరణించాడు. వారి సోదరి కథ్లీన్ కెవెన్‌డిష్ విమాన ప్రమాదంలో కన్నుమూశాడు. జాన్ కెనెడీ కుమారుడు 1999లో తాను నడుపుతున్న విమానం కూలి మరణించాడు. అతనితో పాటు భార్య, ఆమె సోదరి కూడా చనిపోయారు.
ఇప్పుడు రాబర్ట్ కెనెడీ మనవరాలు 22ఏళ్ల సీర్సా కెనడీ హిల్ అతిగా మందులు వాడి గురువారం రాత్రి చనిపోయింది. కెనెడీ హిల్ తాను మానసిక ఒత్తిళ్లతో ఎలా కుంగిపోయానో వివరిస్తూ రాసిన వ్యాసం 2016లో అమెరికాలో ఆమెకు పేరు తెచ్చింది. కెనెడీ హిల్ తండ్రి పాల్ మైకేల్ హిల్ ఐర్లాండ్ వాసి. ఐరిష్ రిపబ్లిక్ (ఐఆర్‌ఏ) జరిపిన బాంబు దాడుల్లో ఆయన పాత్రపై బ్రిటన్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష విధించారు. అయితే 15 ఏళ్ల తర్వాత 1993లో ఉన్నత న్యాయస్థానం ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment