అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనకు పూనుకున్నారు.
‘వైట్ హౌస్‌లో ఉంటున్న అవినీతి కుటుంబం’
సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్‌లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్‌లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు.
‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్‌లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్‌లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు.
‘అవి నిరాధార ఆరోపణలు’
వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు.
ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!
🚨BREAKING🚨
— Oversight Committee (@GOPoversight) July 20, 2023
The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley.
Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG
Comments
Please login to add a commentAdd a comment