impeachment
-
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
ద. కొరియాలో ముదురుతున్న సంక్షోభం
సియోల్(దక్షిణకొరియా): దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) ప్రకటన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు సాహసించారు. అయితే అధ్యక్ష కార్యాలయం భద్రతా బలగాలు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు. దీంతో యూన్ కార్యాలయ ప్రధాన భవనంలోకి పోలీసులు ప్రవేశించలేకపోయారు. దీంతో పౌర సేవల కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆధిక్యత లేకపోవడంతో ఏ బిల్లును ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం, పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యూన్ యోల్ ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ప్రకటించడం తెల్సిందే. తర్వాత విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం చేసి ఎమర్జెన్సీని ఎత్తేయడం, అధ్యక్షుడు యూన్ సహా పలువురు దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం అధ్యక్షుడికి సంబంధించిన ఆఫీస్‌లలో పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. దాడులు జరిగిన సమయంలో అధ్యక్షుడు యూన్ కార్యాలయంలో లేరు. యోన్‌కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు.మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం ‘మార్షల్ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా అరెస్ట్‌పై మనస్తాపంతో ఆయన మంగళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్రయతి్నంచినట్లు అధికారులు తెలిపారు. మార్షల్ లా విధించాలని సిఫార్సు చేసిన కిమ్‌ను రాజధాని సియోల్‌లో ఆదివారం అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి అధికారికంగా అరెస్టు వారెంట్ జారీ కాకముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయతి్నంచగా జైలు అధికారులు ఆయనను వెంటనే అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని రక్షణ శాఖ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. కిమ్‌పై నేరాభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 20 రోజుల్లోపు నిర్ణయం తీసుకోనున్నారు. మరోసారి అభిశంసన గత శనివారం అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రధాన విపక్ష డెమొక్రటిక్ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. మార్షల్ లా అమలు కోసం పనిచేసిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు అధికారులు బుధవారం అరెస్ట్‌చేశారు. రెండోసారి అభిశంసన ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్చేయడం గమనార్హం. -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్‌కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్‌కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్‌లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనకు పూనుకున్నారు. ‘వైట్ హౌస్‌లో ఉంటున్న అవినీతి కుటుంబం’ సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్‌లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. ‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ‘అవి నిరాధార ఆరోపణలు’ వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! 🚨BREAKING🚨 The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley. Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG — Oversight Committee (@GOPoversight) July 20, 2023 -
రిపబ్లికన్ల హ్రస్వ దృష్టి
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా విజయవంతంగా అభిశంసన నుంచి తప్పించుకోగలిగారు. అధ్యక్ష స్థానంలోవున్నవారు అభిశంసన తీర్మానం ఎదుర్కొనాల్సిరావడం అమెరికా చరిత్రలో ఇంతక్రితం కూడా జరిగింది. కానీ పదవినుంచి తప్పుకున్నాక కూడా అది వెన్నాడటం కొత్త రికార్డు. తన నాలుగేళ్ల పాలన, క్లైమాక్స్‌లో ప్రవర్తించిన తీరుతో ట్రంప్ చేజేతులా ఈ అపకీర్తి మూటగట్టుకున్నారు. ఫలితాలు వెలువడిన్పటినుంచి పదవి నుంచి తప్పుకునే వరకూ వున్న దాదాపు 80 రోజుల వ్యవధి ట్రంప్ అరాచక మనస్తత్వాన్ని మరింత బాహాటంగా బయటపెట్టింది. పదవినుంచి తప్పుకునే అధ్యక్షుడిని అమెరికాలో ‘నిరర్ధక అధ్యక్షుడి’గా అభి వర్ణించటం సంప్రదాయం. కానీ ఆ ‘నిరర్థక దశ’ను ట్రంప్ తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నారు. దిగ్భ్రమ కలిగించే నేరాలకు పాల్పడినవారికి సైతం ఉదారంగా క్షమాభిక్ష పెట్టారు. గత నెల 6న కొత్త అధ్యక్షుడి ఎన్నికను లాంఛనంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సమావేశమైనప్పుడు తన మద్దతుదార్లను కేపిటల్ హిల్‌పై దాడికి పురిగొల్పారని సామాజిక మాధ్యమాల సాక్షిగా రుజువైంది. కర్రలు, తుపాకులు వగైరాలు ధరించి వచ్చిన ట్రంప్ మద్దతుదార్ల తీరు చూసి బెంబేలుపడిన అనేకమంది సెనేటర్లు ప్రాణ భయంతో బల్లలకింద దాక్కొనవలసి వచ్చింది. అక్కడ ఎంతో విధ్వంసం చోటుచేసుకుంది. ఇలా చేసినా రిపబ్లికన్ పార్టీకి ఏమాత్రం తప్పనిపించలేదంటే... పదవినుంచి దిగిపోయారు గనుక పట్టించుకోనవసరం లేదంటూ అది వాదించిందంటే ఆ పార్టీ ఎంత మితవాద శక్తిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పార్టీలో ట్రంప్ వంటి నేత అధ్యక్ష స్థానం వరకూ ఎగబాకారంటే వింత ఏముంది? మెజారిటీ సభ్యులు... అంటే వందమందిలో 57 మంది ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించారు. డెమొక్రాటిక్ పార్టీకి వున్న 50 మంది సభ్యులతో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు కూడా తీర్మానానికి మద్దతు పలకటం వల్ల ఇది సాధ్యమైంది. కానీ అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండు వంతులమంది మెజారిటీ (67 మంది) అవసరం గనుక ట్రంప్ విజయవంతంగా బయట పడ గలిగారు. తీర్మానం నెగ్గితే డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి అనర్హు లయ్యేవారు. ఈ అభిశంసన వీగిపోవటం న్యాయం గెలవటంగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. తనను రాజ కీయంగా సమాధి చేద్దామనుకున్నవారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సంబరపడుతున్నారు. తన చేష్టలకు ఏనాడూ పశ్చాత్తాపం ప్రకటించని ట్రంప్ అలా మాట్లాడటంలో వింతేమీ లేదు. కానీ స్వయంగా దేశాధ్యక్షుడే హింసకు పురిగొల్పటాన్ని రిపబ్లికన్ పార్టీ విస్మరించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చర్య ద్వారా అది తనకు తాను నష్టం చేసుకోవటంతోపాటు దేశానికి కూడా నష్టచేసింది. చట్టబద్ధ పాలనను అధ్యక్షుడే అపహాస్యంపాలు చేయటం, ఆవేశంతో ఊగిపోతున్న మూకను కేపిటల్ హిల్‌పై దాడికి పంపటం, వారి విధ్వంసాన్ని తేలిగ్గా తీసుకోవటం, ప్రజా తీర్పును వమ్ముచేసేందుకు ప్రయత్నించటం, రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయటం, అణగదొక్కే ప్రయత్నం చేయటం లాంటి చర్యలను క్షమించటం రిపబ్లికన్ పార్టీ పరువును పాతాళానికి నెట్టేసింది. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం లోపరహితమైనది కాదని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అది నియంతృత్వ పోకడలున్నవారి చేతుల్లోకి జారుకుంటుందని గత నెల 6నాటి పరిణామాలు నిరూపించాయి. దీన్ని కేవలం తమకూ, డెమొక్రటిక్ పార్టీకి మధ్య జరిగే పోరుగా మాత్రమే చూడటం రిపబ్లికన్ పార్టీ హ్రస్వ దృష్టికి నిదర్శనం. పార్టీలో ఇదొక దుస్సంప్రదాయానికి కూడా అంకురార్పణ చేసింది. భవిష్యత్తులో ఒక నిర్మాణాత్మక పద్ధతిలో, మెరుగైన ఆలోచనలతో ముందుకొచ్చి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడేవారికి ఆ పార్టీలో స్థానం దొరకదన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ట్రంప్‌కూ లేదా ఆయన మాదిరిగా ఇష్టానుసారం వ్యవహరించే మరో నాయకుడికి మాత్రమే ఆదరణ లభిస్తుందని శ్రేణులంతా భావిస్తాయి. ‘అందరం ఏకమవుదాం... అమెరికా ఘనతను మరోసారి చాటుదాం’ అంటూ ట్రంప్ ఇచ్చిన తాజా పిలుపు కాస్త హేతుబద్ధంగా ఆలోచించగలిగే రిపబ్లికన్ శ్రేణులను బెంబేలెత్తించివుండాలి. తీర్మానంపై మాట్లాడిన సెనేట్ రిపబ్లికన్ పక్ష నేత మెక్ కానిల్ సైతం ట్రంప్ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని విస్మరించి, హింసకు నైతికంగా బాధ్యుడయ్యారని అంగీకరించారు. ఇంత చెప్పినవారు అభిశంసన తీర్మానంతో గొంతు కలిపేందుకు నిరాకరించటం విడ్డూరం. ఉన్నత స్థాయికి ఎలా ఎగబాకాలో, జనాకర్షణకు మార్గాలేమిటో, సమర్ధులుగా రాణించటం ఎలాగో చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వరంగ నిపుణులు బోలెడు పుస్తకాలు రచించారు. కానీ ప్రజా తీర్పును గౌరవించటం ఎలాగో... హుందాగా పదవినుంచి వైదొలగటం ఎంత ముఖ్యమో చెప్పే పుస్తకాలు ఎవరూ రాసినట్టు లేరు. ఆ మాదిరి పుస్తకాలు అందుబాటులో వుంటే డోనాల్డ్ ట్రంప్‌కు అవి ఏదో మేరకు ఉపయోగపడేవి. ఏదేమైనా తాము నిష్పాక్షికమైన తీర్పరి స్థానంలో వున్నామని... దేశ చరిత్రలో మాయని మచ్చ అనదగ్గ ఒక మహాపరాధానికి కారకుణ్ణి గుర్తించి, శిక్షిం చాల్సిన కర్తవ్యం తమపై వున్నదని రిపబ్లికన్లు గుర్తించలేకపోవటం... ఫక్తు రాజకీయ నేతలుగానే వ్యవహరించటం విషాదం. -
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్‌లో శనివారం జరిగిన ఓటింగ్‌లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్‌ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్‌లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్‌లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్‌లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్‌పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్‌లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్‌పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్‌లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్‌ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్‌కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పలువురు వ్యాపారులను రూ. కోట్లలో ముంచుతున్న సత్తుపల్లికి చెందిన ఘరానా కేటుగాడు బాబురావు ఆగడాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. వందలాది మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వైనంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద వచ్చి కొత్త మోసాలకు పాల్పడుతున్నాడని, ఇంటీరియర్ కంపెనీ కోసం సరుకులు కావాలని వ్యాపారులకు డబ్బులు ఎగనామం పెట్టాడని తెలిపారు. మినరల్ వాటర్ కంపెనీలలో వాటాల పేరుతో లక్షలు లూఠీ చేశాడని, డబ్బులు అడిగిన బాధితులపై భార్యతో లైంగిక వేదింపుల కేసులుపెడుతున్నాడని పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సీసీఎస్, సీఐడీ, విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఇలా వందల కేసులు పెట్టాడని తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కనుబొమ్మలు తీసేయడం, గడ్డం స్టైల్ మార్చడం, టోపీలు పెట్టడం రకరకాల వేషాలు మర్చాడంలో దిట్ట అని చెప్పారు. బాబురావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. -
ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..?
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసు అధికారులను అభిశంసించే అధికారం ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా, కనీసం వివరణ అయినా కోరకుండా తనంత తాను నేరుగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చా.. అసలు నిబంధనలు ఏమి చెబుతున్నాయి? ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అడ్డగోలుగా తనకు లేని అధికారాలను దొడ్డిదారిన చెలాయించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆయన వ్యవహార శైలి.. దుందుడుకు నిర్ణయాలు.. ఉన్నతాధికార వర్గాలలోనే కాదు సామాన్య ప్రజలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారులను భయపెట్టి తాను అనుకున్నది చేయాలనుకుంటున్నారని, అందుకే తనకు లేని అధికారాలను చలాయించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై నిమ్మగడ్డ నేరుగా సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రొసీడింగ్స్ అర్థం లేనివని, న్యాయస్థానం ఎదుట నిలబడవని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అధికారుల వివరణ కోరకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం చర్యలకు సిఫార్సు చేయదని, అలాంటిది ఎస్ఈసీ నేరుగా చర్యలకు ఉపక్రమించడం ద్వారా తన పరిధిని అతిక్రమించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ ‘ఎన్నికల విధుల్లో ఎవరైనా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కమిషన్ తొలుత వారి నుంచి వివరణ కోరుతుంది. దీనిపై సంతృప్తి చెందని పక్షంలో క్రమశిక్షణ చర్యల కోసం సంబంధిత అథారిటీకి సిఫార్సు చేస్తుంది. అంతేగానీ నేరుగా చర్యలు తీసుకోదు’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓ ఐపీఎస్ అధికారి ఓ పార్టీ నాయకుడిని కలవడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది తప్ప నేరుగా చర్యలకు ఉపక్రమించలేదని ఉన్నతాధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2000 నవంబర్ 7వతేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టంగా ఓ ఆఫీస్ మెమొరాండం జారీ చేసింది. దాని ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎన్నికల కమిషన్‌కు ఉంది. అంతిమంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పరిధిని స్పష్టం చేస్తూ 2008 జూలై 28వ తేదీన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మరో మెమొరాండం జారీ చేసింది. ఆ మెమొరాండం ప్రకారం ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. సంబంధిత అథారిటీ మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన ఆరు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలన్నా సంబంధిత అథారిటీ ఆ అధికారి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి అర్థం కావడం లేదూ నిమ్మగడ్డ ఎంత బరితెగించి వ్యవహరించారో అని అధికార వర్గాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమే.. నిమ్మగడ్డ అడ్డగోలు ప్రొసీడింగ్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిమ్మగడ్డ తన పరిధిని దాటి ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడుతున్నారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లేని అధికారాలతో నిమ్మగడ్డ ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా ద్వివేది, గిరిజాశంకర్‌లపై సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వాటిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకునే పరిధి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఎస్ఈసీ జారీ చేసిన సెన్సూర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకుని రావడమేనని, ఇది చట్టపరమైన తప్పిదమన్నారు. నిబంధనలు పాటించకుండా జారీ చేసిన ‘సెన్సూర్’ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సెన్సూర్ ప్రొసీడింగ్స్ విషయంలో మాత్రమే కాదు ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీని బదిలీ చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా నిమ్మగడ్డ అభ్యంతరకర పదజాలాన్ని వాడారని అధికారులు గుర్తు చేస్తున్నారు. -
ట్రంప్ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్ అనునూయులు హింసకు, హేట్ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ విమర్శించారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్య అని మార్క్ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్ అన్నారు. అంతకుముందు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు. ఐదుగురు అటువైపే అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్ రోమ్నీ, బెన్సాసే, సుసాన్ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటే సెనేట్‌లో మూడింట్ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్‌ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు. ట్రయల్ కొనసాగుతుంది సెనేట్‌లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్‌పై అభిశంసన ట్రయల్ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్‌లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్‌లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్‌తో తేలింది. అందువల్ల ట్రంప్‌పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్ వాషింగ్టన్ వీడేది ఎప్పుడంటే..
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం ట్రంప్ వాషింగ్టన్ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోవడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాషింగ్టన్ వెలుపల ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ ప్రధాన కార్యాలయం జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ట్రంప్ వీడ్కోలు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం.. ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని తన మార్ ఏ లాగో క్లబ్లో ట్రంప్ నూతన అధ్యాయన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఇక కొంత మంది వైట్‌హౌస్ సహాయకులు ట్రంప్ కోసం అక్కడ పని చేయనున్నారని తెలిసింది. (చదవండి: అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే) ప్రామణస్వీకారోత్సవానికి ముందే వైట్ హౌస్ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్‌హౌస్ సలహాదారులు రిపబ్లికన్ అధ్యక్షుడిని కోరుతున్నారు. అయితే ట్రంప్ అలా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. తన పదవీ కాలం ముగియడానికి ముందే ట్రంప్ మరి కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్వీయక్షమాభిక్ష అనే అపూర్వమైన పద్దతిని ఎంచుకోనున్నారని వెల్లడించారు -
అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే
వాషింగ్టన్: గత వారం కాపిటల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. దాంతో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇక ట్రంప్ అధ్యక్ష పదవి ముగియడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న సెనేట్ తీసుకువచ్చిన అభిశంసన చర్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్‌ను తొలగించడానికి 232 మద్దతిచ్చారు. కాపిటల్ భవనంపై దాడి ఘటనలో ఐదుగురు మరణించడమే కాక అమెరికాలో ప్రజాస్వామ్య స్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినందుకు గాను ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడానికి డెమొక్రాట్లలో చేరారు. ఇక ట్రంప్ కన్నా ముందు అమెరికా చరిత్రలో మరో ముగ్గురు అధ్యక్షులు కూడా అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, రిచర్డ్ నిక్సన్. వీరిలో బిల్ క్లింటన్‌ని, ఆండ్రూ జాన్సన్‌ని సెనెట్ నిర్దోషులుగా తేల్చగా.. రిచర్డ్ నిక్సన్ ఓటింగ్‌కు ముదే రాజీనామా చేశారు. 1867లో ఆండ్రూ జాన్సన్‌పై తొలిసారిగా అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇక ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై 1867 పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) 1999లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న రెండవ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచారు. మోనికా లెవెన్స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానానికి ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దాంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు. (చదవండి: అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్) ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దాంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా.. నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్‌మెంట్‌పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. చదవండి: ట్రంప్ అభిశంసన దిశగా..! అమెరికా సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్‌కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరగనుంది. చదవండి: ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత -
ట్రంప్ అభిశంసన దిశగా..!
వాషింగ్టన్: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్‌కు పంపిస్తారు. డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్‌ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్‌ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సభ్యడు జేమ్స్ మెక్ గవర్న్ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. ‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబొట్ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్‌ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి మైక్ పెన్స్ ఒక లేఖ రాశారు. అనుకూలంగా ఓటేస్తా అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్ ఎంపీ డాక్టర్ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు. ట్రంప్‌ని తొలగించలేం: పెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 25 ద్వారా ట్రంప్‌ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని ప్రయోగించాలి’’అని మైక్ పెన్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్ నాన్సీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు. అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్‌లో మొహరించిన నేషనల్ గార్డ్ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం -
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్‌లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్‌కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా -
ట్రంప్‌ను తొలగించే తీర్మానాన్ని అడ్డుకున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
చివరి రోజుల్లో.. అవమానభారంతో...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం పది రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయనను సాగనంపాలని డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం నాడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. ట్రంప్ చర్యల్ని రిపబ్లికన్ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘ట్రంప్ చేసిన నేరం చిన్నది కాదు. వెంటనే ఆయనను గద్దె నుంచి దింపేయాలి’’అని రిపబ్లికన్ ప్రతినిధి పాట్ టూమీ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లకి ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌పై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం నెగ్గడం లాంఛనమే. అయితే రిపబ్లికన్లు కూడా ట్రంప్ వైఖరితో విసిగి వేసారి ఉండడంతో వారి ఆధిక్యం ఎక్కువగా ఉన్న సెనేట్‌లో ఏమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఉభయ సభల్లో 150 మందికిపైగా రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌పై తీసుకురానున్న అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ను ఎందుకు అభిశంసించాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఆర్టికల్స్ రచించడం కూడా పూర్తయిందని డెమొక్రాట్ సభ్యుడు టెడ్ లూయీ చెప్పారు. ఈ ఆర్టికల్స్‌కి 180 మంది మద్దతు ఉందన్నారు. క్యాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారుల్ని రెచ్చగొడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లు, వీడియోలన్నీ ఇప్పటికే డెమొక్రాట్లు సేకరించి ఉంచారు. సోమవారం నాడు డెమొక్రాట్లు ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ ఉంటుంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వీడడానికి వారం మాత్రమే గడువు ఉంటుంది. ప్రతినిధుల సభలో నెగ్గిన వెంటనే అభిశంసన తీర్మానం సెనేట్‌కి వెళుతుంది. రిపబ్లికన్లంతా ఏకమై ట్రంప్‌ను వ్యతిరేకిస్తే.. సెనేట్ కూడా అభిశంసనని ఆమోదిస్తే ఆయన గద్దె దిగాల్సిందే. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో నెగ్గితే ట్రంప్ అవమానభారంతో ఇంటి దారి పట్టడమే కాదు, మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోవచ్చు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ట్రంప్ నిలిచిపోతారు. ఏకాకి అవుతున్న ట్రంప్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేకపోవడం, ప్రజాస్వామ్యానికి గుండె కాయలాంటి చట్టసభల భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పడం వంటి చేష్టలతో ట్రంప్ ఏకాకిగా మారుతున్నారు. ఆయన మద్దతుదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు, ఆయన కేబినెట్లోని కొందరు మంత్రులు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారారు. లిసా ముర్కోవ్స్కీ, ఆర్–ఆలస్కా అనే ఇద్దరు మహిళా మంత్రులు ట్రంప్‌ని వెంటనే గెంటేయాలంటూ పిలుపునిచ్చారు. ‘‘ట్రంప్ పదవిలో కొనసాగినన్నాళ్లూ దేశానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రిపబ్లికన్ పార్టీకి కూడా ప్రమాదమేనని కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ స్కిఫ్ అన్నారు. మరోవైపు అభిశంసన ప్రక్రియని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఎవరికీ తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ని తొలగించడంతో ఆయన ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకునే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. -
ట్రంప్ విజయగర్వం
ముందే ఊహించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సెనేట్‌లో అభిశంసన తీర్మానం గురువారం వీగిపోయింది. మరో తొమ్మిది నెలల్లో అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో దఫా పోటీ చేయబోతున్న ట్రంప్‌కు ఇది ముందస్తు విజయమని చెప్పాలి. దాదాపు రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటికి ముగ్గురు అధ్యక్షులు అభిశంసనను ఎదుర్కొనవలసి రాగా, ఆ ముగ్గురిలో ఎవరికీ రెండోసారి పోటీచేసే ఛాన్స్ రాలేదు. ఇప్పటికే ట్రంప్ అనుకూలురు, వ్యతిరేకులుగా నిట్టనిలువున చీలిపోయిన అమెరికా సమాజం వచ్చే నవంబర్‌లో జర గబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా మరిన్ని వైపరీత్యాలు చవి చూడాల్సివస్తుందని తీర్మానం వీగిపోయాక ట్రంప్ చేసిన ప్రసంగం గమనిస్తే అర్థమవుతుంది. రిపబ్లికన్లను ఉద్దేశించి చేసిన ఆ ప్రసంగం ఆద్యంతమూ ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం, సొంత పార్టీకి చెందిన మహిళా నేతలపై కూడా చవకబారు వ్యాఖ్యలు చేయడం కనబడుతుంది. డెమొక్రాట్ల ఆధిక్యత ఉన్న దిగువ సభ ట్రంప్ అభిశంసనను సమర్థించగా, రిపబ్లికన్లు సెనేట్‌లో తమకున్న ఆధిక్యతతో దాన్ని అడ్డుకోగలిగారు. కనుకనే అమెరికా మీడియా మొత్తం అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాట్లు ఇలాంటి వృధా ప్రయాసకు ఎందుకు దిగారని నిలదీసింది. కానీ సెనేట్ విజయాన్ని అత్యంత ఘనమైన విజ యంగా ట్రంప్ నమ్మమంటున్నారు. సభలో తమ పార్టీ వారెవరూ జారిపోకుండా ఆయన చూసు కోగలిగారు. ఆ ఒక్క విషయంలోనూ ట్రంప్ సమర్థతను మెచ్చుకోవాలి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పార్టీలకు అతీతంగా ఓటేయడం అమెరికాలో రివాజు. ఈసారి రిపబ్లికన్లలో మిట్ రోమ్నీ ఒక్కరే ఆ పని చేశారు. ఆయన గతంలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ఒబామాపై పోటీచేసి ఓడిపోయారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంలో రెండు అంశాలున్నాయి. అందులో ఒకటి అధికార దుర్వినియోగానికి సంబంధించింది కాగా, రెండోది కాంగ్రెస్ అధికారాన్ని ట్రంప్ అడ్డగించారన్నది. రోమ్నీ మొదటి అంశంలో డెమొక్రాట్లతో ఏకీభవించి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ రెండో అంశంలో ట్రంప్‌కు అనుకూలంగానే వ్యవహరించారు. అయినా ఆయనను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఆయనంత నాసిరకమైన ప్రచారాన్ని ఎవరూ నిర్వహించలేదన్నారు. ఈ విజయంతో ట్రంప్‌కు పట్టపగ్గాల్లేకుండా పోయాయని పార్టీలోని మహిళా ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేశాయి. కనీసం వారంతా తన పార్టీవారని, తనకు అనుకూలంగా ఓటేసిన వారన్న ఇంగితజ్ఞానం కూడా ట్రంప్‌కు లేకపోయింది. అరిజోనా ప్రతినిధి డెబీ లెస్కోను పేరుతో మొదలుపెట్టి పలు అసందర్భ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ ప్రతినిధి ఎలైస్ స్టెఫానిక్‌ను ‘ఆమె అందంగా వుంటారని తెలుసు. కానీ నోరు తెరిచినప్పుడు కూడా అంతే అందంగా వుంటారని తెలియలేదు. నిజానికి ఆమె మాటలతో వారిని చంపేశారు’ అని నోరు పారేసుకున్నారు. మహిళలు మాత్రమే కాదు...నల్లజాతి ఎంపీలన్నా ఆయనకు చులకనే. జిమ్ జోర్డాన్‌ను ‘ఆయన తన శరీరాన్ని చూసుకుని పొంగిపోతారనుకుంటాను. ముఖ్యంగా తన చెవులు చూసుకుని...’ అంటూ అవ మానకరంగా మాట్లాడారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటివారో కొంత వెనక్కెళ్లి చూస్తే అర్ధ మవుతుంది. కొందరు మహిళలపై చేసిన లైంగిక దాడుల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటున్న టేప్ 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ‘వాషింగ్టన్ పోస్ట్’ బయటపెట్టినప్పుడు ‘ఇది నా జీవితంలో చెడ్డరోజు. ఎందుకంటే అధ్యక్షుడిగా నా అవకాశాలను ఇది ఇబ్బందుల్లో పడేసింది’ అన్నారు. అంటే ఆయనకు చేసిన పనులపై పశ్చాత్తాపం లేదు. అది అధ్యక్ష పదవికి ఎసరు పెడుతుందన్న భయం ఒక్కటే ఉంది. అభిశంసన అంశాల్లో అధికార దుర్వినియోగం కూడా ఉందన్న సంగతిని కూడా మరిచి, ‘అప్పుడే అయిపోలేదు. ప్రతిభావంతులైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు జోయ్ బిడెన్‌కు మున్ముందు ఏం జరుగుతుందో చూడండి’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ తీర్మానం వల్ల ట్రంప్ వైదొలగవలసి వస్తుందని డెమొక్రాట్లు కూడా అనుకోలేదు. అమెరికా ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఆయనలో పరివర్తన వస్తుందని, ఇకపై బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని ఆశించారు. అయితే అది జరగకపోగా, అందుకు విరుద్ధంగా ఆయన మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉన్నదని పార్టీలో సహ మహిళా సభ్యులపైనా, ఇతరులపైనా, ప్రత్యర్థులపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. గతంలో అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్న అధ్యక్షులు నిస్సహాయతలో పడేవారు. వారు సైతం చట్టాలకూ, రాజ్యాంగానికి లోబడి పనిచేయక తప్పదన్న అభిప్రాయం అమెరికా పౌరుల్లో కలిగేది. కానీ ట్రంప్ వాలకం చూస్తే దేశ పౌరులకు ఆయన సూపర్మాన్ అనిపిస్తుంది. తాను అన్నిటికీ అతీతుడినన్న భావన, ప్రత్యర్థులు తనను ఏం చేయలేరన్న భరోసా ఆయనలో కనిపిస్తుంది. ఇది ప్రమా దకరమైనది. ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రికార్డుల్ని వైట్ హౌస్ విడుదల చేయాలా లేదా, అక్కడి సిబ్బంది సాక్ష్యాలను సేకరించవచ్చా లేదా అన్న అంశాలపై న్యాయస్థానాలు విచారించి నిర్ణయించేలోగానే డెమొక్రాట్లు అభిశంసనపై ఎక్కడ లేని తొందరా ప్రదర్శించారు. తీర్మానం ఓడినా, రాజకీయంగా ట్రంప్‌ను బట్టబయలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో అది తమకు లాభిస్తుందని భావిం చారు. ఇది ట్రంప్‌ను కాపాడటానికి సంబంధించిన సమస్య కాదని, మొత్తంగా అధ్యక్ష పదవిలో ఉండేవారి పరిమితుల్ని, జవాబుదారీతనాన్ని నిర్ణయించేదని రిపబ్లికన్లు సైతం అనుకోలేదు. ట్రంప్ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేయలేని సెనేట్ నిస్సహాయస్థితి గమనించాక, ముందూము నుపూ వచ్చే డెమొక్రాటిక్ అధ్యక్షుడు సైతం అదే మాదిరి వ్యవహరించబోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇది అమెరికా నమ్ముకున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుంది. -
మేం ముందే చెప్పాం కదా.. ట్రంప్ నిర్దోషి!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సెనేట్‌లో ఊరట లభించింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ను అభిశంసిస్తూ దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనేట్ గురువారం తిరస్కరించింది. ఈ మేరకు అభిశంసన తీర్మానం సెనేట్‌లో వీగిపోయిందని శ్వేతసౌధం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నేటితో ముగిసింది. మేము గతంలో చెప్పినట్లుగా ట్రంప్ నిర్దోషిగా తేలారు. నిరాధారమైన అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా సెనేట్ ఓటు వేసింది. అధ్యక్షుడి రాజకీయ ప్రత్యర్థులైన డెమొక్రాట్లు, అధ్యక్ష బరిలోని నిలవాలని ఆశించి భంగపడిన ఓ రిపబ్లికన్ మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్‌ను అభింసించిన విషయం తెలిసిందే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జో బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి ట్రంప్ సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా ఆయనపై కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు అభింశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో సంఖ్యా బలం కలిగిన డెమొక్రాట్లు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. తదుపరి ఆ తీర్మానం సెనేట్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సెనేట్‌లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్లు... అభిశంసన తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ట్రంప్ నిర్దోషిగా తేలారు. (ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం) Office of the Press Secretary, White House: The Senate voted to reject the baseless articles of impeachment, and only the President’s political opponents – all Democrats, and one failed Republican presidential candidate – voted for the manufactured impeachment articles. https://t.co/HKZfU6IsSE — ANI (@ANI) February 5, 2020 -
సెనేట్ కొట్టేయాలి అంతే..
వాషింగ్టన్: తనపై మోపిన అభిశంసన తీర్మానాన్ని సెనేట్ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురవుతున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించగా.. త్వరలోనే దీనిపై విచారణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ తరువాత విచారణ విషయంలో కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే అభిశంసన విచారణ సాక్షులకు తనదైన ఆలోచనలు పంచిన ట్రంప్ ఆదివారం మాత్రం విచారణ జరగడానికే వీల్లేదన్నారు. టంప్‌ను కలిసిన హర్షవర్ధన్ ష్రింగ్లా వాషింగ్టన్: అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా (57), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. పదవీ కాలం ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లనున్న భారత రాయబారిని అమెరికా అధ్యక్షుడు కలవడం ఇదే మొదటిసారి. 2019 జనవరి 9 నుంచి అమెరికాలో భారత రాయబారిగా పని చేస్తున్న ష్రింగ్లా తన పదవీకాలాన్ని ముగించుకొని భారత్‌కు తిరిగి రానున్నారు. భారత్‌లో ఈ నెల 29న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్‌ను కలిసి తనకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
గీత దాటితే వేటు ఎప్పుడు?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హైడ్రామాలో గీత దాటిన ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపుపై న్యాయనిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరమే ఆ చట్టం వర్తిస్తుందని కొందరు.. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా జంపింగ్‌లపై చర్యలు తీసుకోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ కోవిదుడు రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఈ చట్టం వర్తించదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారా? లేదా? అన్నది సమస్య కాదు. పార్టీ గీత దాటినవారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది’ అని అన్నారు. అజిత్‌ను సమర్థిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండొంతులుంటే అనర్హత సమస్యే ఉత్పన్నం కాదని మరో లాయర్ చెప్పారు. -
ట్రంప్‌పై మళ్లీ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. పదవి నుంచి ఎలా తొలగిస్తారు ? అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎదుర్కొన్నవారెవరు? అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది. -
ట్రంప్‌పై మళ్లీ అభిశంసన ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడ మీద అభిశంసన కత్తి వేళ్లాడుతోందా ? ట్రంప్ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికే ఎసరు పెడతాయా ? మరోసారి ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న చర్చ మొదలైంది. అసలు అమెరికా అధ్యక్షుడిని అభిశంసించే ప్రక్రియ ఎలా సాగుతుంది ? ట్రంప్ భవిష్యత్ ఏమిటి ? చిక్కుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్ , ప్రచార మాజీ మేనేజర్ పాల్ మనాఫోర్ట్ లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన సెక్స్ స్కాండల్ ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ట్రంప్ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతేకాదు ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్, పార్న్స్టార్ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలీకుండా ముడుపులు చెల్లించాలని ట్రంప్ తనకు చెప్పారంటూ కోహెన్ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపుతారా అన్న చర్చకు దారి తీశాయి. ట్రంప్ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లయిపోతారని బెదిరించారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది. అధ్యక్షుడి అభిశంసన ఎలా ? అమెరికా అధ్యక్షుడిని అభిశంసించడం అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోరమైన నేరానికి పాల్పడడం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకి వస్తాయి) వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమేనని తేలితే ఏయే ఆర్టికల్స్ కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు. ఆ ఆర్టికల్స్‌పై మళ్లీ సభలో సమగ్రమైన చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌కు పంపుతారు. అక్కడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. ట్రంప్‌ను ఇప్పుడు ఎలా అభిశంసిస్తారు ? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్బిఐ ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న నిజాలు, తాజా పరిణామాలు ట్రంప్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. రాజకీయంగానూ ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రచార ఆర్థిక నేరాల్లో ట్రంప్ ఆంతరంగికులు ఒక్కొక్కరుగా న్యాయ స్థానాల్లో దోషులుగా తేలుతున్నారు. ముల్లర్ విచారణలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేస్ ఫ్లిన్, ట్రంప్ అనుచరుడు జార్డ్ పపడోపోలస్లు ఇప్పటికే రష్యాతో ట్రంప్ శిబిరం సాన్నిహిత్యంపై తాము అబద్ధాలే చెప్పామని అంగీకరించారు. ఇప్పుడు కొహెన్, మనాఫోర్ట్ దోషులుగా తేలారు. మాజీ ప్రచార మేనేజర్ పాల్ మనాఫోర్ట్ మరిన్ని కొత్త విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. చట్టవిరుద్ధ చర్యలతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడాన్ని నేరంగా పరిగణిస్తారు. అదే ట్రంప్‌పై అభిశంసనకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా ఎన్నికల ప్రచారంలో సలహాదారుడిగా పని చేసిన బ్రెయిన్ క్లాస్ అభిప్రాయపడ్డారు. నవంబర్ ఎన్నికలే అభిశంసనకు రెఫరెండం ఈ పరిణామాలన్నీ నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమొక్రాట్లకు లాభిస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికలే ట్రంప్‌పై అభిశంసనకు ఒక రిఫరెండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. డెమొక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌పై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో వీగిపోయింది. చాలా మంది డెమొక్రాట్లే ట్రంప్‌పై అభిశంసన తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే నవంబర్ ఎన్నికల వరకు డెమొక్రాట్లు ట్రంప్‌ను గద్దె దింపే సాహసం చేసే అవకాశం కనిపించడం లేదు. చరిత్రలోకి తొంగి చూస్తే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరూ అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ, సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో వాటర్‌గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మార్కెట్లు కుప్పకూలుతాయా ? అధ్యక్ష పదవి నుంచి తనను తొలగిస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని , అమెరికా ప్రజలందరూ నిరుపేదలుగా మారుతారంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ జరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు ట్రంప్‌ను గద్దె దింపడమే సాధ్యం కాదని, అనూహ్యమైన పరిస్థితుల్లో అది జరిగినా మార్కెట్లకి వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకువచ్చిన పన్నుల సంస్కరణ, నిబంధనల సవరణ అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరేలా ఉన్నాయని ఇన్వెస్కోలో చీఫ్ గ్లోబల్ మార్కెట్ వ్యూహకర్త క్రిస్టినా హూపర్ అభిప్రాయపడ్డారు. పైగా ఇప్పుడు ట్రంప్ కొత్తగా ప్రతిపాదిస్తున్న వాణిజ్య విధానాలు మార్కెట్‌కి అనుకూలంగా లేవని ఆమె చెప్పారు. మార్కెట్లపై ట్రంప్ అభిశంసన ప్రభావం ఉంటుందనితను అనుకోవడం లేదని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ జిల్ పోల్సెన్ వ్యాఖ్యానించారు. అనుకోని విధంగా ట్రంప్ అభిశంసనకు గురైతే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షుడు అవుతారు. ఆయన దాదాపు ట్రంప్ అనుసరించే విధానాలనే కొనసాగిస్తారని మెజారీటీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.