
అరుణ్ జైట్లీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు విపక్షాలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ సహా విపక్షాలు అభిశంసనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ అది ప్రతీకార పిటిషన్ అని అభివర్ణించారు. ఇది ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఒక న్యాయమూర్తిని ఒత్తిడికి గురిచేసి ఇతర న్యాయమూర్తులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. జస్టిస్ బీహెచ్ లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన వెనువెంటనే ఈ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తించాలని జైట్లీ అన్నారు.
న్యాయమూర్తిని అభిశంసించాలన్న విపక్షాల వ్యూహం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు సీజేఐ పనితీరుపై గతంలో న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలోనే అభిశంసన తీర్మానం ముందుకొచ్చిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. న్యాయమూర్తుల మధ్య విభేదాలపైనా జైట్లీ స్పందిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది పెనుసవాల్ విసురుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment