మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది.
ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్‌లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్‌లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు.
అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment