motion
-
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
రౌడీషీటర్లలో గుబులు
భూదందాలు, సెటిల్మెంట్లపై పోలీసుల దృష్టి మాఫియా కదలికలపై నిఘా ఆరు నెలల్లో అరికడతామన్న ఏఎస్పీ గోదావరిఖని : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌తో కోల్‌బెల్ట్ ప్రాంతంలోని రౌడీషీటర్లలో గుబులు మొదలైంది. భూదందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన నయీమ్ చివరకు పోలీసుల చేతిలోనే హతమవడం గమనార్హం. గోదావరిఖనిలో 2012లో కట్టెకోల సుధీర్ అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత రౌడీషీటర్ల ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. అయితే జిల్లాలోనే అతి ఎక్కువగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 47 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 25 మంది పలు దందాలను కొనసాగిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇటీవల గోదావరిఖని మార్కండేయకాలనీ, అడ్డగుంటపల్లితోపాటు పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పట్టా భూములపై రౌడీషీటర్లు కన్నేసి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఈ భూదందాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో భూదందాలను అరికడతామని ప్రకటించారు. నÄæూమ్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతాలైన గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ అనుచరులున్నారు. మంచిర్యాల కొత్త జిల్లా కావడం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడపడం, గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారే ఇక్కడ ఎక్కువగా భూములు కొనుగోలు చేయడం, అమ్మడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నయీమ్ ముఠా సభ్యులు ఇక్కడి భూముల దందాలో కూడా ప్రవేశించినట్టు సమాచారం. రెండు నెలల క్రితం నయీమ్ ముఠా సభ్యుడు, ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో ఆయన గోదావరిఖనికి వచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. కానీ అంతకుముందు కూడా ఆయన, ఆయన అనుచరులు మంచిర్యాల, గోదావరిఖనితోపాటు మంథని ఏరియాలో కూడా తిరుగుతూ సెటిల్మెంట్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరిఖనికి చెందిన కొందరు రౌడీషీటర్లు పలు కేసులలో జైళ్లలో మగ్గుతుండగా... మరికొందరు భూదందాలు, సెటిల్మెంట్లు చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. మాట వినని వారిని బెదిరింపులకు గురిచేస్తున్న క్రమంలో బాధితులు ఎవరికి చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. అయితే పలువులు బాధితులు మాత్రం నేరుగా తమకు జరుగుతున్న అన్యాయంపై స్వయంగా ఏఎస్పీని ఆశ్రయిస్తుండగా... ఆయన సదరు రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ ఎవరైనా రౌడీషీటర్ భూదందాలు, సెటిల్మెంట్లలో భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తిస్తే తమదైన శైలీలో వారికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తాజాగా నయీమ్‌ను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడంతో స్థానిక రౌడీషీటర్లు తమకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ స్థానిక రౌడీషీటర్లకు గుణపాఠం కావాలని కోల్‌బెల్ట్ వాసులు కోరుకుంటున్నారు. -
వివాదాస్పదంగా మారిన రాజధాని విరాళాలు
-
పుష్కరాల్లో తొక్కిసలాట బాధాకరం: చంద్రబాబు
-
మామూలు కుటుంబంలో పుట్టి....
-
ఈ ముసలాయన ఊరికే ఉండలేడా?
ప్రేమ కడుపులో దాచిపెట్టుకుంటే సరిపోదు. అలా చేస్తే ప్రేమ కూడా మురిగిపోతుంది. ఎందుకంటే ప్రేమకీ కోపానికీ పెద్ద తేడాలేదు. కోపం మనసులో వుంచుకుంటే బుర్ర పాడైపోతుంది. ప్రేమ మనసులో వుంచుకుంటే బొర్ర పాడవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన చాలా మందికి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినంత రిలీఫ్ వుంది. మోషన్లో ఇంత ఎమోషన్ ఉందని పికూ చెప్పింది.అతడు కలకత్తా నుంచి బయటపడ్డాడు కానీ అతడి నుంచి కలకత్తా మాత్రం బయట పడలేదు. టాయిలెట్ గది మూసుకొని ఉంది. లోపల ముసలి తండ్రి ఉన్నాడు.బయట కూతురు గస పోసుకుంటూ అతణ్ణి తిట్టి పోస్తోంది. ‘ఈ ముసలాయన ఊరికే ఉండలేడా? ఎందుకు చీటికి మాటికి నా ప్రాణం తీస్తాడు? ఈ వయసులో సైకిల్ వేసుకొని ఎక్కడకు వెళ్లినట్టు? కింద పడి ఏ కాలో చెయ్యో విరిగితే ఎవరు పడాలి? ఇప్పుడు చూడండి. ఏం ఎరగనట్టుగా లోపలికెళ్లి తలుపేసుకున్నాడు. ఇంకాసేపటికి మొదలవుతుంది గోల. మొదట ఊపిరాడ్డం లేదు అంటాడు. ఆ తర్వాత ఛాతీలో నొప్పి అనో గుండెకు తూట్లు పడ్డాయనో’.... లోపల పెద్ద చప్పుడయ్యింది. కూతురు ఆశ్చర్యపోయి తిట్టడం ఆపేసింది. అది ఫ్లష్ చేసిన చప్పుడు. తండ్రి తన జీవితంలో అంత పెద్దగా ఎప్పుడూ ఫ్లష్ చేసి ఎరగడు. తలుపు తెరుచుకుంది. తండ్రి బయటికొచ్చాడు. అతడు తండ్రి కాదు. విశ్వాన్ని జయించిన అలెగ్జాండర్. ‘ఏంటీ’... అంది కూతురు కుతూహలంగా. ‘అయ్యింది. ’ ‘అవునా?’‘అవును. ఇంత హాయిగా సుఖంగా సులభంగా ఎప్పుడూ అవలేదు. నెవర్. ఆహా... ఎంత నిశ్చింతగా ఉంది’ పొట్ట మీద చేతులేసుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. పెదాల మీద చిర్నవ్వు. కూతురు కూడా కోపాన్ని వీడి తండ్రినే చూస్తూ మెల్లగా నవ్వింది. డెబ్బయ్యేళ్ల ముసలాడతడు. ఒక్కతే కూతురు. ఆషొ, మాషో, భాషో అని షకారాలు మాట్లాడే బెంగాలీ కుటుంబం. కలకత్తా నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడింది. తండ్రికి కూతురు, కూతురికి తండ్రి, వాళ్లకో పనివాడు. అంతే. తెల్లవారుతుంది. కాఫీ టీ అనే శబ్దాలు వినిపించవు. కూతురి గొంతు నుంచి ఒకటే మాట- అయ్యిందా? టాయిలెట్ నుంచి తండ్రి అదే సమాధానం- లేదూ. కడుపు మందం అతనికి. రోజూ పొద్దున్నే అవదు. ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా అవదు. వయసు వల్ల ఉబ్బరమో లేక లోపల అది ఉండిపోవడం వల్ల ఉబ్బరమో తెలియదుకాని ముసలాయనికి ఎప్పుడూ కడుపు ఉబ్బరంగానే ఉంటుంది. అమ్మాయ్... డాక్టర్గారికి ఒకసారి ఫోన్ చెయ్... పోనీ మందేం మార్చాలో అడుగు... లేదంటే తిండేమైనా మార్చమంటావా..... రోజూ సవాలక్ష ప్రశ్నలు. ఆఫీస్‌లో ఉంటే మెసేజ్‌లు. ఒక్క సమాధానం కోసం. కాదు... ఒక్క సంతృప్తికరమైన విరేచనం కోసం. అవదు. అవకపోవడం వల్ల ముసలాయనకి ఇరిటేషన్. పనిమనిషి ఫినాయిల్ ఎత్తుకుపోయిందని తిడతాడు. పక్కింటామె మాటవరసకి పలకరిస్తే కరుస్తాడు. ఇంటికి స్వయంగా భార్య చెల్లెలు వచ్చినా పుల్లవిరుపు మాటలే. అందరికీ ఆయన యాగీ తెలుసు. కాని ఇంటికి రాక తప్పుతుందా? వయసొచ్చిన కూతురి కోసం. తండ్రి కోసం అన్నీ వదులుకున్న పికూ అనే ఆ ఆడపిల్ల కోసం. ముసలాయనికి అన్నీ అనుమానం. అలోపతి వాడడు. హోమియోపతే పడాలి. ఏదంటే అది తినడు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఖిచిడీయే తినాలి. ప్రతి పూట బిపి చెకింగ్ తప్పదు. దాంతోపాటు కూతురు ఎవరితోనైనా ప్రేమా పెళ్లీ అంటుందేమోననే చెకింగూ తప్పదు. ‘నువ్వు ఇలాగే ఉండు. స్వతంత్రంగా ఉండు. అవసరాల కోసం కావాలంటే ఎవరితోనైనా సంబంధం పెట్టుకో. కాని పెళ్లి మాత్రం చేసుకోకు’... ఇదీ ముసలాయన గోల. వచ్చిన సంబంధం అంతా పాడు చేస్తుంటాడు. కూతురికి ఇదంతా నలుగుబాటు. తండ్రిని వదులుకోలేదు. అలాగని ఇంకొకరిని కోరుకోకుండా ఉండనూ లేదు. ఆ చిరాకు అందరి మీదా చూపిస్తుంటుంది. పెద్ద పెద్ద కళ్లు, పలుచటి పెదాలు... ఏం లాభం? నవ్వే మర్చిపోయింది. ఒకటే టెన్షన్. తండ్రి టెన్షన్. తండ్రికి? కూతురు టెన్షన్. నిజంగా ఈ చిక్కుముడి వీడదా? అయితే ఇది చిక్కుముడి కాదు. ఊరితో ముడిపడిన ముడి. పేగుతో ముడిపడిన ముడి. మూలాలతో ముడిపడిన ముడి. ఆ ముడి అర్థం కాకపోతే కథ అర్థం కాదు. ‘నాకు నా భార్యంటే ఇష్టమే. ఆమెను ప్రేమిస్తా. కాని ఆమె నా కూతురికి ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వలేదు’ అనంటాడు ముసలాయన ఒక సందర్భంలో. కూతురంటే అంత ప్రేమ అతడికి. భార్య చనిపోయింది. కూతురు తల్లిలేని పిల్ల అయ్యింది. అందుకని తనే తల్లీదండ్రీ అయ్యాడు. కూతురు ఎదిగొచ్చింది. ఆర్కిటెక్ట్ అయ్యింది. ఢిల్లీకి చేరుకుంది. ఆమెను వదిలి ఎలా ఉండగలడు. కనురెప్పలా వెంటపడి వచ్చాడు. అయితే అందుకోసం తాను పుట్టి పెరిగిన కలకత్తా నగరాన్ని, ఆ ఇరుకు వీధులని, ఆ రంగు వెలసిన ట్రామ్లని, తల్లి పేరు మీద తండ్రి ఎంతో ఇష్టపడి కట్టించిన ఎర్రరంగు గోడల ‘చంపాకుంజ్’ అనే బంగ్లాని వదల్లేక వదిలి వచ్చేశాడు. ఆ వెలితి ఉండిపోయింది. అప్పటికీ ఢిల్లీలో బెంగాలీలు ఎక్కువగా ఉండే చిత్తరంజన్ పార్క్ ఏరియాలో చేరాడు. ఇంట్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి పటాలు పెట్టుకున్నాడు. బెంగాలి మాటా తీరూ వదల్లేదు. తిండీ తిప్పా మార్చలేదు. అయినా సరే వెలితే. ఏళ్ల తరబడి వచ్చిన అలవాట్లు ఉంటాయి. చాదస్తాలు ఉంటాయి. పైగా చెవుడు. అల్లుడెవడైనా వస్తే తనను యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో... ఈ ముసలాణ్ణి ఎక్కడైనా వదిలించుకో అని కూతురికి దూరం చేస్తాడో ఏమో అదొక భయం. వయసు మీద పడింది... చావుకు దగ్గరవుతున్నాడు... మంచాన పడి కూతురికి శ్రమ ఇస్తాడో ఏమో... ప్రాణం మీదకు వస్తే ఆస్పత్రుల్లో పెట్టి ఆ సర్జరీలు ఈ సర్జరీలు అని హింసిస్తారో ఏమో... బతికించడానికి చంపుతారో ఏమో... ఇదొక అనుమానం. ఇవన్నీ పక్కనపెట్టి కలకత్తాలోని బంగ్లాని కూతురు అమ్మేద్దామని చూస్తోంది. ఎంత పెద్ద నిర్ణయం. మూలాల్ని పెకలించి వేస్తుందా? వద్దు అని గట్టిగా చెప్పగలడు. కాని వినకపోతే? అదొక ఆందోళన. పాపం సాదాసీదా స్వచ్ఛమైన మనిషి కదా. ఈ మలినాలన్నీ మెదడులో చేరాయి. అది మలబద్ధకంగా మారింది. క్రానిక్ కాన్స్టిపేషన్. దీని నుంచి విముక్తం కావాలి. తనకు అర్థమైపోయింది. మొన్న ఒక పెగ్గు బిగించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాక బండి తుదకు చేరింది అని తెలిసిపోయింది. అందుకే కూతురిని శతపోరి కలకత్తా బయల్దేరదీశాడు. విమానంలో కాదు. ట్రైన్‌లోనూ కాదు. ట్యాక్సీలో. కాని వీళ్ల భయానికి ఒక్క డ్రైవరూ దొరకడు. క్యాబ్ కంపెనీ ఓనరే దయతలచి డ్రైవర్‌గా వస్తాడు. కూతురులాగే అతడూ ముసలయాన్ని పైపైన చూశాడు. పైగా విరేచనానికి సలహాలు కూడా ఇచ్చాడు. తులసీ, పుదీనా నీళ్లలో వేసి వేడి చేసి తాగండి. ఊహూ. విరేచనం కాదు. ఇండియన్ పద్ధతిలో కింద కూచున్నట్టుగా కూచోండి. ఊహూ. అప్పుడూ కాదు. పోనీ ప్రతీదీ గేదలానో ఆవులానో బాగా నమిలి మింగండి. దీనికీ ఊహూనే. కలకత్తా వచ్చింది. మాతృభూమి గాలి అచ్చు అమ్మలాగే ముసలాయన ముఖాన్ని తాకింది. ఆ ఊరు ఆ వీధులు ఆ మనుషులు... తనవాళ్లు. ఆ గంగ. తనది. ఆ సమున్నత హౌరా వంతెన. తనదే. మరుసటిరోజు తెల్లవారుజామున పనివాడి సైకిల్ తీసుకొని సంతోషంగా కలకత్తా వీధులన్నీ తిరిగాడు. ఆ వీధుల నిండా ఎన్ని జ్ఞాపకాలో. బాల్యపు జ్ఞాపకాలు, తల్లిదండ్రుల జ్ఞాపకాలు, భార్య జ్ఞాపకాలు, తానంటూ ఒక మనిషిగా జీవించిన జ్ఞాపకాలు... వాటిని గుండెల నిండా నింపుకున్నాడు. మనసు నిండింది. ఆత్మ నిండింది. కడుపు కూడా. ఇంటికి వచ్చాడు. విరేచనం. సుఖ విరేచనం. ఇంతకాలం వేధిస్తున్న వెలితి, అసౌకర్యం తల్లిదండ్రుల సన్నిధి వంటి తన ఇంటికి చేరుకున్నాక ఆ ముసలాయనకు తీరింది. ఆ మరుసటిరోజు తెల్లవారుజామున టాయిలెట్ అవసరం ఏర్పడలేదు. కలకత్తా ఆయువు ఒకటి కలకత్తాలో కలిసిపోయింది. ఇంట్లో అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు. అమ్మా నాన్నలు ఉంటారు. ఏదో నస పెడుతుంటారు. కాని జాగ్రత్తగా వినాలి. వాళ్ల మాటలకు అర్థాలు వేరు. వారి కోపానికి అర్థాలు వేరు. వారి ఆందోళనలకు అర్థాలు వేరు. వారి అశ్రువులకు కూడా అర్థాలు వేరు. జుట్టు తెల్లబడ్డ పసివాళ్లు వారు. పాలపళ్లు రాని కన్నబిడ్డలను కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్దవాళ్లనూ ప్రయోజకులనూ చేసి అలసిపోయి ఇప్పుడు పసివాళ్లయిపోయి ఉంటారు. వాళ్ల చిన్న చిన్న వెలితులు కూడా పెద్ద సమస్యలైపోతాయి. కొంచెం పట్టించుకోవాలంతే. మా అమ్మ కదూ... బుజ్జికదూ అనాలంతే. అంతకు మించి ఆశించరు. తండ్రి మనసులో ఉన్న వెలితి ఏమిటో కూతురు కనిపెట్టింది. బంగ్లా అమ్మలేదు. అంతేకాదు, కర్మంతరాల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి తండ్రి ఆత్మ సంతోషపడేలా మరో చిన్న పని కూడా చేసింది. అప్పటి వరకూ వాళ్ల ఇంటి పేరు- ఆఏఅఓఅఖ ్కఅఔఅఇఉ. బెంగాలీ ఉచ్ఛారణకు తగినట్టుగా ‘అ’ బదులు ‘ై’ పెట్టి దానిని ఆఏఅఓైఖ ్కఅఔఅఇఉగా మార్చింది.ఆమె మారినట్టే. ఇక మనం మారాల్సి ఉంది. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
ఎయిర్పోర్ట్ పేరు మార్చొద్దని టీ.అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును మార్చవద్దని తెలంగాణ శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న పేర్లను యథావిధిగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటంపై తీర్మానంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై విచారణ వ్యక్తం చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి. కాగా కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంలో బీజేపీ సవరణలు సూచించింది. విమానాశ్రయం పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం, పీవీ నరసింహారావు పెట్టాలని కోరింది. మరోవైపు టీడీపీ మాత్రం ఎన్టీఆర్ పేరునే ఉంచాలని సూచించింది. -
కుదిపేసిన అతిసార
- గువ్వలదిన్నెలో బాలుడి మృతి - మరో 20 మందికి తీవ్ర అస్వస్థత - గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ ధరూరు: మండలంలోని గువ్వలదిన్నె గ్రామాన్ని అతిసారవ్యాధి కుదిపేసింది. సోమవారం వాంతులు, విరేచనాలతో ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. మరో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు భయాందోళనతో ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామానికి చెందిన వీరన్న, ఆదమ్మల కొడుకు నవీన్(9) గత రెండురోజులుగా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. మొదట ఆర్ఎంపీకి చూపించగా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కర్ణాటకలోని రాయిచూరు ఆస్పత్రికితీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు నవీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురైన ఉసెనప్పగౌడ్, పద్మమ్మ, జ్యోతి, మల్లేష్‌గౌడ్‌తో పాటు మరో నలుగురిని చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యధికారులు గ్రామానికి చేరుకుని వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఆర్డీఓ సందర్శన.. విషయం తెలుసుకున్న గద్వాల ఆర్డీఓ భిక్షానాయక్, ఇన్చార్జి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్సింహనాయుడు, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ బషీర్ తదితరలు గ్రామానికి చేరుకుని సమీక్షించారు. తాగునీటి పైప్‌లైన్‌కు గ్రామానికి చెందిన రైతులు కొందరు డ్రిప్ పైపులను అమర్చి నీటిని అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఆ డ్రిప్‌పైపులు అమర్చిన ప్రాంతాల్లో నిలిచిన నీరు తిరిగి తాగునీటి పైపుల్లోకి వెళ్లడంతో తాగునీరు కలుషితమైనట్లు గుర్తించారు. ఏడాదికాలంగా ట్యాంకును శుభ్రం చేయడం లేదని..కలుషితనీటినే తాగుతున్నామని స్థానికులు వాపోయారు. రోగులకు మెరుగైన వైద్యం - ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డీకే అరుణ వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వలదిన్నె వాసులను ఆమె సోమవారం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అతిసార ప్రబలుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆర్డీఓ భిక్షానాయక్కు సూచించారు. అతిసార మరింతగా విజృంభించకుండా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శంకర్, తిమ్మన్న, భాస్కర్‌యాదవ్ ఉన్నారు. -
ప్రత్యేక హోదా ఇవ్వండి
మరో 10 తీర్మానాలకూ ఆమోదం పోలవరం ఆర్డినెన్స్ తక్షణమే ఉపసంహరణ అమరవీరులకు ఘన నివాళులు సింగరేణి కార్మికులకూ పన్ను రాయితీ బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకూ అదనంగా 33 శాతం సీట్లు కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీ శాఖ ఏర్పాటు వెంటనే రెండుగా హైకోర్టు విభజన ఎవరెస్ట్ వీరులకు జేజేలు.. రూ. 25 లక్షల నజరానా హిమాచల్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి టీవీ-9పై చర్యలకు చైర్మన్, స్పీకర్లకు అధికారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఉభయసభలూ ఏకగ్రీవంగా తీర్మానించాయి. దాంతోపాటు అమరవీరులకు సంతాపం తెలపడంతో పాటు మొత్తం పదకొండు తీర్మానాలను శనివారం ఏకగ్రీవంగా ఆమోదించాయి. సీమాంధ్రకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలను తెలంగాణకు కూడా ఇవ్వాలని అసెంబ్లీ డిమాండ్ చేసింది. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించింది. తెలంగాణ శాసనసభను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్లకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పిన్న వయసులో ఎవరెస్టును అధిరోహించిన సాంఘిక గురుకుల విద్యార్థులను సభ అభినందించింది. వారికి భారీ నజరానా ప్రకటించింది. సీఎం ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలనూ పెద్దగా చర్చ లేకుండానే ఉభయసభలూ ఆమోదించాయి. అవి ఇలా ఉన్నాయి... పోలవరం ఆర్డినెన్స్ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అది రాజ్యాంగవిరుద్ధం. గిరిజనుల హక్కులు కాలరాయడమే. తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండా సరిహద్దులు మార్చడం అన్యాయం. దీనివల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో గిరిజనులు జీవించే హక్కు కోల్పోతారు. 460 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్లాంటును తెలంగాణకే ఇవ్వాలి. ఆర్డినెన్స్ వల్ల రుద్రకోట ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కష్టపడుతున్న సింగరేణి కార్మికులకు సైన్యానికి ఇస్తున్న మాదిరిగానే పన్ను మినహాయింపు ఇవ్వాలి. ప్రత్యేక హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలి. వెంటనే అందుకవసరమైన చర్యలు చేపట్టాలి. తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్లు పోషించిన పాత్ర కీలకమైనది. తెలంగాణ న్యాయవాదులు, ప్రజలు తమ సొంత హైకోర్టు కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓబీసీ మంత్రి ఉండాలి దేశంలో 40 నుంచి 50 శాతం మేరకున్న ఓబీసీల కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి నిధులివ్వాలి. నరేంద్ర మోడీ రూపంలో ఒక బీసీ వ్యక్తి తొలిసారి ప్రధానమంత్రి అయిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. మహిళలకు చట్టసభల్లో సీట్లు చట్టసభల్లో 33 శాతం అదనపు సీట్లను ఏర్పరిచి వాటిని మహిళలకు రిజర్వ్ చేయాలి. మహిళల భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందుతుంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు మేం కట్టుబడి ఉన్నాం. వారు జనాభాలో 50 శాతమున్నా చట్టసభల్లో మాత్రం ప్రస్తుతం కేవలం 10 శాతమే ఉన్నారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు పార్లమెంట్లో, శాసనసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరముంది గనుక ఈ మేరకు అవకాశం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.