హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును మార్చవద్దని తెలంగాణ శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న పేర్లను యథావిధిగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటంపై తీర్మానంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై విచారణ వ్యక్తం చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి. కాగా కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంలో బీజేపీ సవరణలు సూచించింది. విమానాశ్రయం పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం, పీవీ నరసింహారావు పెట్టాలని కోరింది. మరోవైపు టీడీపీ మాత్రం ఎన్టీఆర్ పేరునే ఉంచాలని సూచించింది.