ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు దేశాధినేతలను ఆహ్వానించారు. ప్రస్తుతం వీరంతా రాజధాని ఢిల్లీకి తరలివస్తున్నారు.
భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆదివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మహ్మద్ ముయిజ్జు భారత్‌కు వచ్చారు.
‘నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రివర్గమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు న్యూఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెంట్‌లో తెలియజేశారు.
బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తదితరులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment