లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద దేశంలో ఆందోళన మొదలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వేలమంది బ్రెజిలియన్లు వీధుల్లోకి వచ్చారు.
సావ్ పౌలో(బ్రెజిల్): లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద దేశంలో ఆందోళన మొదలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వేలమంది బ్రెజిలియన్లు వీధుల్లోకి వచ్చారు. అవినీతికంపులో కూరుకుపోయిన అధ్యక్షురాలు తమకు వద్దంటూ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రుసెఫ్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వెంటనే సభాసమావేశాలు నిర్వహించి ఆమెను వెంటనే తొలగించే కార్యక్రమాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బ్రెజిల్లోనే అత్యధిక జనాబా ఉండే సావ్ పౌలో నగరంలో ఈ ఆందోళన ప్రారంభమైంది. ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న రోగరియో చెకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ 'ఇప్పుడు మేం మా దేశంలో నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. మార్పు తెచ్చుకునేందుకు ముందుకు వెళుతున్నాం. అధ్యక్షురాలు దిల్మా రుసెఫ్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఆమెపై వ్యతిరేకత నానాటికి పెరిగిపోయింది. వెంటనే ఆమె పదవి నుంచి దిగిపోవాలి' అని అతడు డిమాండ్ చేశాడు.