ట్రంప్‌ కోసం పోర్న్ సంచిక ప్రకటన | Porn publisher offers up to $10 million on Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కోసం పోర్న్ సంచిక ప్రకటన

Published Sun, Oct 15 2017 12:32 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Porn publisher offers up to $10 million on Trump - Sakshi

సాక్షి : అమెరికా అడల్ట్ కథనాల సంచిక హస్ట్లర్‌ (లారీ ఫ్లైంట్‌) ఆదివారం ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచిత్యుడిని చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు తమకు ఇవ్వాలని  ఓ ఆహ్వాన ప్రకటన వెలువరించింది. ఇందుకుగానూ 10 మిలియన్‌ డాలర్ల నజరాను అందజేస్తామని ది వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచికలో ప్రకటన ఇచ్చింది.

74 ఏళ్ల లారీ క్లాక్స్‌టన్‌ ఫ్లైంట్‌ నేతృత్వంలో నడుస్తున్న ఈ అడల్ట్ సంచిక ఇంతకు ముందు కూడా ట్రంప్‌ పై ఇలాంటి ఆఫర్‌ నే ప్రకటించింది కూడా. గతేడాది అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై లైంగికపరమైన వివాదాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించి 1 మిలియన్‌ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించగా.. 2005లో ట్రంప్ చేసిన నీచమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. 

ట్రంప్‌ పేరిట ఓ ఫిక్షన్‌ పోర్న్ పేరడీ స్టోరీని హస్ట్లర్‌ సంచిక కొంత కాలం ప్రచురించింది కూడా. ఇక తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనపై స్పందించేందుకు వైట్‌హౌజ్‌ ప్రతినిధులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement