President Donald Trump
-
కరోనాని అంతం చేస్తాం
వాషింగ్టన్ : అమెరికా శాస్త్ర, వైద్య విజ్ఞానంతో చైనా వైరస్ కరోనాని అంతమొందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా బారిన పడ్డ ట్రంప్ మిలటరీ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స తీసుకొని వచ్చిన అనంతరం శనివారం వైట్‌హౌస్ బాల్కనీ నుంచి తన మద్దతుదారులనుద్దేశిం చి మాట్లాడారు. తను ఇప్పుడు చాలా బాగున్నానని చెప్పారు. తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా శాస్త్రవేత్తలు తమ శక్తికి మించి పని చేస్తున్నారని త్వరలోనే వ్యాక్సిన్ వచ్చి కరోనా మాయమైపోతుందని అన్నా రు. ఈ సందర్భంగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికాని సోషలిస్టు దేశంగా మారుస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వమన్నారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం పెన్సిల్వేని యా, లోవాలో ప్రచారాన్ని నిర్వహిస్తారు. ట్రంప్ నుంచి వైరస్ సోకదు అధ్యక్షుడు ట్రంప్ 14 రోజుల క్వారంటైన్ పూర్తి కాకుండానే జనంలోకి రావడం, మాస్కు లేకుండా కూడా మాట్లాడడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు సియాన్ కాన్లే వివరణ ఇచ్చారు. ట్రంప్ నుంచి ఇతరులకి ఇక వైరస్ సోకదని స్పష్టం చేశారు. ఆయనకు జ్వరం రావడం లేదని, క్రియాశీలకంగా మారే వైరస్ కణాలేవీ ఆయన శరీరంలో లేవని చెప్పారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ సీడీసీ నిబంధనల ప్రకారం ట్రంప్ ఐసొలేషన్ నుంచి బయటకు రావచ్చునని తెలిపారు. అయితే కరోనా పరీక్షల్లో ట్రంప్‌కి నెగిటివ్ వచ్చిందా లేదా అన్న దానిపై కాన్లే స్పష్టతనివ్వలేదు. -
ట్రంప్‌కు భారీ షాక్: రెండోసారి షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికా మరోసారి షట్‌డౌన్ అయింది. కీలకమైన బిల్లుకు అమెరికా సేనేట్‌లో మరోసారి వీగిపోవడంతో మూడువారాల్లో రెండోసారి ప్రభుత్వం స్థంభించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. సేనేట్తో పాటు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది. కాంగ్రెస్(సేనేట్, హౌజ్ ఆఫ్ కామన్స్), వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నా.. షట్‌డౌన్ లాంటి పరిస్థితిని రెండోసారి ఎదుర్కోవల్సి రావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బేనని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా జనవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
ట్రంప్ కోసం పోర్న్ సంచిక ప్రకటన
సాక్షి : అమెరికా అడల్ట్ కథనాల సంచిక హస్ట్లర్ (లారీ ఫ్లైంట్) ఆదివారం ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచిత్యుడిని చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు తమకు ఇవ్వాలని ఓ ఆహ్వాన ప్రకటన వెలువరించింది. ఇందుకుగానూ 10 మిలియన్ డాలర్ల నజరాను అందజేస్తామని ది వాషింగ్టన్ పోస్ట్ సంచికలో ప్రకటన ఇచ్చింది. 74 ఏళ్ల లారీ క్లాక్స్టన్ ఫ్లైంట్ నేతృత్వంలో నడుస్తున్న ఈ అడల్ట్ సంచిక ఇంతకు ముందు కూడా ట్రంప్ పై ఇలాంటి ఆఫర్ నే ప్రకటించింది కూడా. గతేడాది అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై లైంగికపరమైన వివాదాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించి 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించగా.. 2005లో ట్రంప్ చేసిన నీచమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పేరిట ఓ ఫిక్షన్ పోర్న్ పేరడీ స్టోరీని హస్ట్లర్ సంచిక కొంత కాలం ప్రచురించింది కూడా. ఇక తాజాగా వారు విడుదల చేసిన ప్రకటనపై స్పందించేందుకు వైట్‌హౌజ్ ప్రతినిధులు నిరాకరించారు. -
వైట్ హౌజ్‌లో రియాల్టీ షో!
సాక్షి : గత రెండు రోజులుగా వైట్ హౌజ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. అస్తవ్యస్త పాలనతో ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆ పార్టీ సెనెటర్ ఒకరు బుధవారం మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యకుడు కిమ్ జంగ్ ఉన్‌తో మాటల యుద్ధం, లాస్ వెగాస్ కాల్పుల ఘటన, ఫ్లోరిడా తుఫాన్ బాధితులను ఆదుకోవటంలో ట్రంప్ విఫలం అయ్యాడంటూ ఆయన చెబుతున్నారు. ‘‘గత రెండు రోజులుగా వైట్ హౌస్ లో పెద్ద రియాటి షో జరుగుతోంది(ట్రంప్ భార్యల వ్యవహారాన్ని ఉద్దేశించి). ప్రథమ పౌరురాలు ఎవరన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు’’ ఆ సెనేటర్ మండిపడ్డారు. జాతీయ భద్రత కార్యదర్శిగా పనిచేస్తున్న రేటెల్లర్సన్ పై ట్రంప్ వ్యవహరించిన తీరును ఆ సెనెటర్ తప్పుబట్టారు. రేటెల్లర్సన్ ను ఐక్యూ టెస్ట్ కు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించటాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిని ఆయన(ట్రంప్) ఎలా దూషిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన సూచించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరుపుదామన్న రేటెల్లర్సన్ సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఇంకోవైపు రిపబ్లికన్ సెనేటర్ బాబ్ కొర్కర్.. ట్రంప్‌ను మూర్ఖుడిగా అభివర్ణించారు. ఫేక్ మీడియాపై ట్రంప్ ఫైర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డాడు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్బీసీ నెట్‌వర్క్‌తోపాటు మరికొన్ని అమెరికన్ ఛానెళ్లను మూసివేయిస్తానని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాలనను తప్పుబడుతూ తరచూ ఆయా ఛానెళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయిందని, పన్నుల సంస్కరణలో ట్రంప్ దారుణంగా విఫలం అయ్యాడంటూ ఏకీపడేశాయి. దీనికి తోడు వైట్‌హౌజ్ ప్రధాన అధికారి జాన్ ఈ కెల్లీని ట్రంప్ తొలగించబోతున్నాడంటూ మరో వార్తను ప్రసారం చేశాయి. దీంతో ట్రంప్ బుధవారం తన ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేశారు. ఫేక్ మీడియా కారణంగా దేశం గొప్పతనం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ఇది ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని, అవసరమైతే వాటి లైసెన్లు రద్దు చేసేందుకైనా సిద్ధమని ట్రంప్ చెప్పారు. Network news has become so partisan, distorted and fake that licenses must be challenged and, if appropriate, revoked. Not fair to public! — Donald J. Trump (@realDonaldTrump) October 12, 2017 -
స్వాప్నికులకు’ అనుమతి!
పౌరసత్వం మాత్రం ఇవ్వం: ట్రంప్ వాషింగ్టన్: అమెరికాలో స్వాప్నికులు (డ్రీమర్స్) నివసించేందుకు అనుమతించాలని అనుకుంటున్నాననీ, వారికి పౌరసత్వం మాత్రం ఇవ్వనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు. ఇది కార్యరూపం దాలిస్తే భారతీయులు సహా దాదాపు 8 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. వారిలో భారతీయుల సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన డీఏసీఏ (బాల్యంలో అక్రమంగా వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని ట్రంప్ ఇటీవల రద్దు చేయడం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల నాయకులు చుక్ స్కమర్, న్యాన్సీ పెలోసీలతో ట్రంప్ బుధవారం భేటీ అయిన అనంతరం గురువారం ఈ తాజా ప్రకటన చేశారు. అయితే అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో నిర్మించే గోడకు డెమోక్రాట్లు మద్దతిస్తేనే తాను డీఏసీఏపై వెనక్కు తగ్గుతానని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా ట్రంప్‌తో భేటీ అనంతరం పెలోసీ, స్కమర్లు మాట్లాడుతూ ట్రంప్‌తో భేటీ ఫలప్రదమైందనీ, స్వాప్నికులకు డీఏసీఏ కార్యక్రమం ప్రసాదించిన వెసులుబాట్లను చట్టరూపంలోకి తేవడానికి ట్రంప్ అంగీకరించారని తెలిపారు. మెక్సికో గోడ మినహా, మిగతా సరిహద్దు భద్రతా ప్యాకేజీ గురించి ఓ అవగాహనకు వచ్చామని అన్నారు. అయితే ఏ ఒప్పందం తమ మధ్య కుదరలేదనీ, ఒప్పందానికి దగ్గరగా మాత్రమే ఉన్నామని ట్రంప్ ఓ ట్వీట్లో స్పష్టం చేశారు. హెచ్–1బీపై ఆంక్షలు ఉండవు... అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఇతర దేశాల వారిని అనుమతించే హెచ్–1బీ వీసాలపై ఇంకా ఆంక్షలు ఉండవని ఓ అధికారి వెల్లడించారు. హెచ్–1బీ వీసా విధానాన్ని ట్రంప్ యంత్రాంగం ఇంకా పరిశీలిస్తోందనీ, ఆంక్షలను విధించలేదన్నారు. గత 9 నెలల్లో మంజూరు చేసిన హెచ్–1బీ వీసాల్లో 70 శాతం భారతీయులకే దక్కాయనీ, గతేడాది 12 లక్షల భారతీయుల వీసాలకు చట్టబద్ధత కల్పించామని ఆ అధికారి పేర్కొన్నారు. హెచ్–1బీ, ఎల్1 వీసాల్లో ప్రతి ఏడాది భారతీయుల వాటా ఆరు శాతం వృద్ధి చెందుతోందన్నారు. ఈ నెల 27న జరగనున్న అమెరికా–భారత్ ద్వైపాక్షిక చర్చల్లో హెచ్–1బీ అంశాన్ని చేర్చలేదని అధికారి చెప్పారు. -
డోనాల్డ్ ట్రంప్ మాస్కులతో దోపిడీలు
రోమ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొంగలకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. 26, 30 ఏళ్లు కలిగిన విట్టోరియా, ఇవాన్ లఫోర్ అనే ఇద్దరు అన్నదమ్ములు డోనాల్డ్ ట్రంప్ ముఖాలు కలిగిన మాస్కులను ధరించి ఇటలీలోని పలు ఏటీఎంలను దోచుకున్నారు. దాదాపు 1,15,000 డాలర్ల విలువైన నగదును ఎత్తుకుపోయారు. వారు ఏటీఎంలలో జొరబడి ముందుగా సీసీటీవీ కెమేరాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఏటీఎంలలోకి పేలుడు పౌడరును పంపించి పేలుస్తారు. వాటి అరల్లో ఉండే నగదును ఎత్తుకుపోతారు. ఈ ఇద్దరికి హాలివుడ్ సినిమాలను చూసే అలవాటు కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. వారు దోపిడీచేసే విధానం చూస్తే రెండు హాలివుడ్ సినిమాలు గుర్తుకురాక తప్పవు. 1991లో విడుదలైన ‘పాయింట్ బ్రేక్’ చిత్రంలో కియాను రీవెస్, పాట్రిక్ స్వేజ్లు అమెరికా మాజీ అధ్యక్షుల మాస్కులు ధరించి బ్యాంకులను దోచుకుంటారు. ఇక్కడ విట్టోరియా, ఇవాన్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి మాస్కులను ధరించారు. ఇక 1997లో విడుదలైన ‘ది జాకాల్’ చిత్రంలో హీరో బ్రూస్ విల్లీస్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన కారు రంగు మారుస్తాడు. ఇక్కడ విట్టోరియా, ఇవాన్‌లు తమ తెల్లరంగు మెర్సిడెస్ కారుకు నల్లరంగు వేశారు. ఎవరి మాస్కులు ధరిస్తేనేమీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనేమీ టూరిన్ నగరం సమీపంలో ఓ ఏటీఎంను ఇలాగే దోచుకొని పారిపోతుండగా అన్నదమ్ములు ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జైలుకు తరలించారు. వారిప్పుడు జైలు నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఐడియా కోసం హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నట్లున్నారు. -
ఆర్థిక సహకారంపై చిగురించిన విశ్వాసం
ట్రంప్, మోదీ భేటీపై పరిశ్రమ వర్గాల సంతోషం న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన తొలి భేటీలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్న నిర్ణయానికి రావడం పట్ల దేశీయ పరిశ్రమ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు దేశాల ద్వైపాక్షిక బంధంపై తిరిగి విశ్వాసం నెలకొన్నట్టు పేర్కొన్నాయి. ట్రంప్, మోదీ భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను అసోచామ్ స్వాగతించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్ణయించడం 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ పరిశ్రమకు అత్యంత సానుకూలమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక రంగాల్లో అదనపు ఉత్పత్తి విషయమై రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించడం మరో సానుకూలమైన చర్యగా అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. నియంత్రణ పరమైన అంశాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించుకోవడం భారత ఫార్మా పరిశ్రమకు సానుకూలమన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు యూఎస్ఫ్డీఏ నుంచి తనిఖీలు, అభ్యంతరాల పేరుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో మోదీ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విశ్వాసం వ్యక్తం కావడం, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ముందుకు తీసుకెళ్లాలని అంగీకారం కుదరడం సంతోషకరమని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ అన్నారు. రక్షణ, ఇంధన రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ కలసి పనిచేయాలని అభిలషించారు. -
విస్మయం: మోదీ భార్య కోసం కారు డోర్ తెరిచి..!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వైట్‌హౌస్‌లో విందు స్వీకరించిన మొదటి విదేశీ నేత ప్రధాని నరేంద్రమోదీ. ఇరుదేశాల స్నేహబంధాన్ని మరింత ముందుకుతీసుకెళ్లే లక్ష్యంతో అమెరికాకు వచ్చిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ మీడియా సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ట్రంప్ కుటుంబంతో విందు ఆరగించేందుకు వైట్‌హౌస్ వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మోదీని సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే, ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ వద్ద మెరిన్ సెంట్రీ గార్డులు ప్రధాని మోదీ కారు రాగానే తమ సంప్రదాయక విధులు నిర్వహించారు. ఇరువైపులా నిలుచున్న వారు.. మోదీ కారు రాగానే సెల్యూట్ చేశారు. ఆ తర్వాత కారు సమీపానికి వెళ్లి డోర్లు పట్టుకొని.. (అంకెలు లెక్కిస్తూ) కాసేపు నిలుచుకున్నారు. ఆ తర్వాత డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ప్రధాని కారులో కుడివైపు కూర్చున్నారు. సహజంగా ఎడమవైపు నాయకుల సతీమణులు కూర్చుంటారు. కుడివైపు డోర్ తీయగానే ప్రధాని మోదీ దిగిపోయారు. అటువైపు గార్డు మాత్రం ఎడమ డోర్ తీయడానికి కొంతసేపు కష్టపడ్డాడు. ఆ తర్వాత బలవంతంగా డోర్ తీశాడు. ఎడమవైపు నుంచి ఎవరు దిగకపోవడంతో అతను కొంత బిత్తరపోయినట్టు కనిపించాడు. టీవీలలో ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు వెంటనే పోస్టులు పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ తన భార్యతో కలిసి జీవించడం లేదు. విదేశీ పర్యటనలకు ఆయన ఒంటరిగానే వెళుతారు. ఈ విషయం అమెరికాకు తెలియదా? ఎందుకు ఇలా రెండువైపులా డోర్లు తీసే ఏర్పాట్లు చేశారు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయమై కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే, ఇలా గార్డులు రెండువైపులా డోర్లు తీయడం లాంఛనప్రాయమైన చర్య అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ వైట్‌హౌస్ నుంచి వెళ్లేటప్పుడు కూడా గార్డులు రెండువైపులా కారు డోర్లు తీసి నిలబడ్డటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. 1 Modi's car arrives 2. Guard salutes 3. Goes to open the door for Mrs Modi 4. NO Mrs Modi -
పాక్‌కు భారత్, అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: దాయాది పాకిస్థాన్‌కు భారత్, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి. తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరపకుండా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించాయి. 26/11 ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారులను చట్టం ముందుకుతెచ్చి సత్వరమే శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదుల స్వర్గధామలాలను నిర్మూలిస్తామని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడిగా ప్రతిన బూనారు. 'ఉగ్రవాద నిర్మూలనే మాకు అత్యంత ప్రాధాన్య విషయం' అని ట్రంప్‌తో కలిసి సంయుక్త ప్రకటన చేస్తూ మోదీ పేర్కొన్నారు. తన భూభాగం వేదికగా చేసుకొని ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకుండా పాక్ చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతల తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. 'మేం ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం గురించి చర్చించాం. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని మోదీ చెప్పారు. ఉగ్రవాద సంస్థలను, వాటిని నడిపించే భావజాలాన్ని ధ్వంసం చేయాలని ఇరుదేశాలూ నిశ్చయించినట్టు ట్రంప్ తెలిపారు. -
ట్రంప్‌ను భారత్‌కు ఆహ్వానించిన మోదీ
వాషింగ్టన్: భారత్‌కు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. 'మీ కుటుంబసభ్యులతోపాటు మీరు భారత్ రావాల్సిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు భారత్‌లో ఆహ్వానం పలికి అతిథ్యమిచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి' అని మోదీ కోరారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్స్‌లో ట్రంప్‌తో కలిసి సంయుక్త మీడియా ప్రకటన చేసే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య తొలిసారి జరిగిన దౌత్య సమావేశంలో మోదీ-ట్రంప్ విస్తారంగా చర్చించుకున్నారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో ఇద్దరు మంతనాలు జరిపారు. ఏకాంతంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. మోదీకి పదే పదే ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. తమ సంభాషణ ఎంతో ఫలప్రదంగా సాగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా మధ్య స్నేహం, పరస్పర గౌరవం గతంలో ఎన్నడూలేనిరీతిలో గొప్పగా కొనసాగనుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్రంప్ కూతురు ఇవాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్తరార్ధంలో భారత్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రీనుర్షిప్ సదస్సుకు వచ్చే అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇవాంక నేతృత్వం వహించాలని మోదీ కోరారు. తన ఆహ్వానాన్ని ఆమె అంగీకరించిందని భావిస్తున్నట్టు చెప్పారు. భారత్‌కు రాబోతున్న ట్రంప్! ఇక మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఇవాంక ట్రంప్ ఆయనకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు భారత్‌కు రావాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని డొనాల్డ్ ట్రంప్ సైతం అంగీకరించారు. ఆయన త్వరలో భారత్‌కు రానున్నట్టు వైట్‌హౌస్ ధ్రువీకరించింది. అయితే, ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన వివరాలేవీ ఇంకా వెల్లడించలేదు. -
మోదీకి ఫోన్ చేసిన ట్రంప్..
-
మోదీకి ఫోన్ చేసిన ట్రంప్..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోదీ పార్టీ(బీజేపీ) అద్భుత విజయాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రధానికి శుభాకాంక్షలు చెప్పినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ సోమవారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తూ, ఆందోళనకర అంశంగా మారిన జాత్యహంకార దాడులపై ఇరు నేతలు చర్చించింది, లేనిది తెలియాల్సిఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటలకే ట్రంప్ మొదటిసారి మోదీతో మాట్లాడారు. అనంతరం రెండుమూడు సందర్భాల్లో వివిధ అంశాలపై ఫోన్లోనే చర్చలు జరిపారు. అయితే తొలిసారి భారత అంతర్గత రాజకీయాల(ఎన్నికల్లో విజయం)పై ట్రంప్ మాట్లాడటం విశేషం. అందుకే ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీలో జరిగిన తాజా ఎన్నికల్లోనూ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెర్కెల్‌కు కూడా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. -
ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 25న బెల్జియంలోని బ్రసెల్స్ పర్యటనకు వెళుతారని వెట్హౌస్ ప్రకటించింది. ఇదే ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన అయ్యే అవకాశముంది. అయితే, ఇది దౌత్యపర్యటన కాదు. బ్రసెల్స్‌లో జరగనున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దేశాధినేతల సమావేశంలో ట్రంప్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం గురించి నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టన్‌బర్గ్ మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాటోతో అమెరికాకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, ఈ కూటమికి సంబంధించిన కీలకాంశాలను చర్చించేందుకు, ఉగ్రవాదంపై పోరాటం సహా పలు అంశాలలో నాటో ఉమ్మడి పోరాటం, బాధ్యతలను పెంపొందించేందుకు నాటో దేశాధినేతల సమావేశంలో పాల్గొనాలని ట్రంప్ నిర్ణయించినట్టు ఆయన ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. నాటో చెల్లనికాసులాగా మారిపోయిందని, బ్రసెల్స్ జీవించడానికి వీలుకాని నరకంలా మారిందని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లిం మతం దేశాల నుండి వలసలను పరిమితం చేయడంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇమ్మిగ్రేషన్ కార్వ నిర్వాహక ఆదేశాలపై కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు రడీ అవుతోంది. ఏడు ముస్లిందేశాల శరణార్ధులపై ట్రంప్ తాజా ఆదేశాలను అడ్డుకునేందుకు వాషింగ్టన్ స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం సహకారంతో ఈ దావా వేయనున్నట్టు మైక్రో సాఫ్ట్ ప్రతినిది పీట్ వూటెన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న ట్రంప్ తాజా నిర్ణయాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రతిపాదనలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విదేశాంగ శాఖ సిద్ధమవుతోంది. ఈమేరకు అమెరికన్ కాంగ్రెస్ సీనియర్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా ఇమ్మిగ్రేషన్ ఆంక్షలపై ఇప్పటికే టెక్ దిగ్గజాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విమర్శలు గుప్పించారు.అ మెరికా వలస దారులదేశమనీ, ట్రంప్ నిర్ణయం సరైదని కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ ఆర్డర్‌తో రిస్కులో గూగుల్ ఉద్యోగులు
ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ కంపెనీల సీఈవోలందరూ ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై విమర్శలు సంధించారు. ఏడు దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి రాకుండా నిషేధం విధించడం పిచాయ్ తప్పుపట్టారు. ట్రంప్ ఆదేశాలు తమ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయని తెలుపుతూ కంపెనీ స్టాఫ్‌కు ఓ ఈ-మెయిల్ రాశారు. దానిలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను విమర్శించారు. 187 మంది గూగుల్ ఉద్యోగులపై ఈ ఆర్డర్ ప్రభావం చూపనుందని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌తో చూపే ప్రభావంపై తాము చింతిస్తున్నామని, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌తో తమ సహచరులకు తలెత్తే వ్యక్తిగత వ్యయాలు చాలా బాధకరమన్నారు. విదేశాలకు ట్రావెల్ చేసే గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల అమెరికాకు వచ్చేయాలని పిచాయ్ ఆదేశించారు. గూగుల్ సెక్యురిటీ, ట్రావెల్, ఇమ్మిగ్రేషన్‌పై కంపెనీ సాయం చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీల్లో పనిచేసే వారు, కేటాయించిన పనులపై విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారిదగ్గర వాలిడ్ వీసా ఉన్నప్పటికీ వారు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిస్తోంది. శుక్రవారం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్లకు చెందిన పౌరులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. ఈ ఏడు దేశాలకు చెందిన వారిదగ్గర గ్రీన్ కార్డు ఉన్నా.. వారిని అమెరికాలోకి రానిస్తారో లేదో అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది. -
ట్రంప్ ట్రింఫ్.. ఓ టెక్నాలజీ అద్భుతం
వాషింగ్టన్: ‘డొనాల్డ్ జాన్ ట్రంప్ అనే నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా విశ్వసనీయతతో విధులు నిర్వర్తిస్తానని, దేశ సంరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని, సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అంటూ లక్షలమంది సాక్షిగా వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్.. అసలైన ట్రింఫ్ (విజయోత్సవం) జరుపుకున్నారు. అదే వేదికపై అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన తొలి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నిదేశాల్లోని వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లు ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని హైలైట్ చేశాయి. అయితే అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం ట్రంప్ చిన్నబుచ్చుకునేలా.. జనంలేని ప్రదేశాల ఫొటోలను ప్రధానంగా ప్రచురించాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ట్రంప్.. జర్నలిస్టులను నీతిలేని వాళ్లంటూ తిట్టిపోశారు. ఈ గొడవ సంగతి పక్కనపెడితే.. ట్రంప్ ట్రింఫ్ సందర్భంగా ‘సీఎన్ఎన్’ చిత్రీకరించిన ఫొటో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్యాపిటల్ భవనంపై ట్రంప్ ప్రసంగిస్తుండగా, బిడ్డింగ్తోపాటు సుదూరంలో ఉన్న జనాలను సైతం కవర్‌చేస్తూ 360 డిగ్రీల కోణంలో ఓ గిగాపిక్సల్ ఫొటోను తీశారు. దూరం నుంచి తీసినప్పటికీ, ఫొటోను జూమ్ చేస్తూ పోయేకొద్దీ అక్కడున్న అందరి ముఖాలను స్పష్టంగా చూడొచ్చు. కుడి, ఎడమలకు పాన్ చేస్తూ 360 డిగ్రీల అనుభూతిని పొందొంచ్చు. టెక్నాలజీ పరంగా అద్భుతమంటూ ప్రశంసలు పొందుతున్న ఫొటోను మీరూ చూసి ఆనందించాలనుకుంటే.. ఇక్కడ క్లిక్ చేయండి. -
ట్రంప్ అన్నంతపని చేస్తున్నారు..
- ‘మెక్సికో సరిహద్దు గోడ’ ఫైలుపై నేడు సంతకం - శరణార్థులు, వలసలపైనా అధ్యక్షుడుడి కీలక నిర్ణయాలు! వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. వివాదాస్పద ‘యూఎస్- మెక్సికో సరిహద్దు గోడ’ను ఖచ్చితంగా నిర్మిస్తామని పునరుద్ధాటించారు. దీనికి సంబంధించిన ఫైలుపై నేడే(బుధవారమే) సంతకం చేయనున్నట్లు తెలిపారు. శరణార్థుల ప్రవేశంపై నిషేధం, వలసల నిరోధంపైనా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘జాతీయ భద్రతకు సంబంధించి అతిపెద్ద నిర్ణయానికి రంగం సిద్ధమైంది. అవును. యూఎస్- మెక్సికోల మధ్య గోడను కట్టబోతున్నాం’ అని అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెపారు. మెక్సికో నుంచి అమెరికాకు విచ్చలవిడిగా వచ్చిపడుతోన్న డ్రగ్స్, వలసలను అరికట్టేందుకు సరిహద్దులో గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. నాటి ట్రంప్ హామీపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు, విమర్శలు చెలరేగడం, ‘గోడలు కాదు ట్రంప్.. వంతెనలు కట్టండి’అనే సందేశాలు వెల్లువెత్తడం విదితమే. కాగా, ‘గోడ నిర్మాణం’ఫైలుతోపాటు శరణార్థులు, వలసలపైనా ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. వాస్తవానికి 2006లోనే అమెరికన్ కాంగ్రెస్‌లో ‘మెక్సికో సరిహద్దు గోడ’ బిల్లు పాస్ అయింది. కొంతమేరకు నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నేడు సంతకం చేయనున్న తాజా ఫైలుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదాన్ని కోరతారా?లేదా? అనేది తెలియాల్సిఉంది. కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ తీరం నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరందాకా.. యూఎస్- మెక్సికోల మధ్య మొత్తం 3,201కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 1,050 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఇనుప కంచెను నిర్మించారు. ఇక ట్రంప్ సంతకంతో మిగిలిన భాగంలోనూ పని పూర్తిచేస్తారు. అధునాతన వ్యవస్థల సహాయంతో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ విభాగం ఈ సరిహద్దుకు కాపలాకాస్తుంది. Big day planned on NATIONAL SECURITY tomorrow. Among many other things, we will build the wall! — Donald J. Trump (@realDonaldTrump) January 25, 2017 -
ట్రంప్ దగ్గరున్న ఖరీదైన కార్లేమిటో తెలుసా?
డొనాల్డ్ జే. ట్రంప్...ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించి, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 45వ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ట్రంప్, బిజినెస్‌మ్యాన్‌గా, రియల్ ఎస్టేట్ మొగల్‌గా, రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీగా ఎంతో పాపులర్ కూడా. ఆయనకు కార్లంటే అమితాసక్తట. కార్లంటే ఇంత పిచ్చి ఉన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర చాలా ఖరీదైన కార్లే ఉన్నాయట. ట్రంప్ దగ్గరున్న కొన్ని కార్ల వివరాలు... లాంబోర్ఘిని డయాబ్లో : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా ఎక్కువగా ప్రాముఖ్యం చెందిన ఈ ఇటాలియన్ కారుకు ట్రంప్ 90లోనే యజమాని అట. 1997లో ట్రంప్ ఈ కారును కొనుగోలు చేశారు. 90లో ఈ కారు మోస్ట్ ఐకానిక్ కారుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కారు గంటకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లు. సూపర్ స్పోర్ట్స్ కారు సెగ్మెంట్ డియాబ్లోకే అంకితం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లు 3000 యూనిట్లు అమ్ముడుపోయాయి. రోల్స్-రాయిస్ ఫాంటమ్: మీ దగ్గర అమితమైన సంపద ఉందనుకో మీరేం చేస్తారు? చాలామందైతే రోల్స్ రాయిస్ కొనుక్కోని ఎంచక్కా రోడ్లపై పరుగులు పెట్టిస్తుంటారు. సంపన్న వ్యక్తంటే రోల్స్ రాయిస్... రోల్స్ రాయిస్ అంటే సంపన్న వ్యక్తి. మరి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలి, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దగ్గర, ఈ కారు ఉండకుండా ఉంటుందా? ట్రంప్ దగ్గర కూడా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉందట. 6.7 లీటర్, వీ-12 ఇంజన్‌ను కలిగిన ఈ కారు 453 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తిచేస్తుందట. ఈ కారు ధర 500,000 డాలర్లు అంటే రూ.3,41,00,050. రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ : 1956లోనే రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనుగోలు చేశారట. కొన్ని ఈవెంట్లకు ఆయన ఈ కారులోనే వెళ్లేవారట. 1955 నుండి 1966 మధ్య కాలంలో ఈ బాక్స్ రూపంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ కార్లను రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసింది. రోల్స్ రాయిస్ దీనిని మూడు జనరేషన్లలో విడుదల చేసింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 165 కిలోమీటర్లు. 1950 కార్లతో పోలిస్తే దీన్ని స్పీడేమి తక్కువ కాదంటలేండి. 2003 మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఆర్ మెక్లారెన్: 2003లో ఇది విడుదల చేసినప్పటినుంచి మెర్సిడెస్కు ఇది సూపర్ మార్కెట్‌గా ఉంది. ఇది చాలా ఖరీదైన కారట. దీని ధర 455,000 డాలర్లట. దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3 కోట్లకు పైమాటే. మెర్సిడెస్, బెంజ్ కలిసి దీన్ని రూపొందించాయి. 2005లో ఇది ట్రంప్ టవర్‌లోకి ప్రవేశించిందట. ట్రంప్ ఈ కారును ఎక్కువగా ఇష్టపడతాడని టాక్. ఇవే కాక ఇంకా చాలా బ్రాండెడ్ కార్లే ట్రంప్ దగ్గరున్నాయట.