సాక్షి : గత రెండు రోజులుగా వైట్ హౌజ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. అస్తవ్యస్త పాలనతో ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆ పార్టీ సెనెటర్ ఒకరు బుధవారం మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యకుడు కిమ్ జంగ్ ఉన్‌తో మాటల యుద్ధం, లాస్ వెగాస్ కాల్పుల ఘటన, ఫ్లోరిడా తుఫాన్ బాధితులను ఆదుకోవటంలో ట్రంప్ విఫలం అయ్యాడంటూ ఆయన చెబుతున్నారు.
‘‘గత రెండు రోజులుగా వైట్ హౌస్ లో పెద్ద రియాటి షో జరుగుతోంది(ట్రంప్ భార్యల వ్యవహారాన్ని ఉద్దేశించి). ప్రథమ పౌరురాలు ఎవరన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు’’ ఆ సెనేటర్ మండిపడ్డారు. జాతీయ భద్రత కార్యదర్శిగా పనిచేస్తున్న రేటెల్లర్సన్ పై ట్రంప్ వ్యవహరించిన తీరును ఆ సెనెటర్ తప్పుబట్టారు. రేటెల్లర్సన్ ను ఐక్యూ టెస్ట్ కు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించటాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిని ఆయన(ట్రంప్) ఎలా దూషిస్తారని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన సూచించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరుపుదామన్న రేటెల్లర్సన్ సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఇంకోవైపు రిపబ్లికన్ సెనేటర్ బాబ్ కొర్‌కర్.. ట్రంప్‌ను మూర్ఖుడిగా అభివర్ణించారు.
ఫేక్ మీడియాపై ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డాడు. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్‌బీసీ నెట్‌వర్క్‌తోపాటు మరికొన్ని అమెరికన్ ఛానెళ్లను మూసివేయిస్తానని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పాలనను తప్పుబడుతూ తరచూ ఆయా ఛానెళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోయిందని, పన్నుల సంస్కరణలో ట్రంప్ దారుణంగా విఫలం అయ్యాడంటూ ఏకీపడేశాయి. దీనికి తోడు వైట్‌హౌజ్ ప్రధాన అధికారి జాన్ ఈ కెల్లీని ట్రంప్ తొలగించబోతున్నాడంటూ మరో వార్తను ప్రసారం చేశాయి.
దీంతో ట్రంప్ బుధవారం తన ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు చేశారు. ఫేక్ మీడియా కారణంగా దేశం గొప్పతనం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ఇది ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని, అవసరమైతే వాటి లైసెన్లు రద్దు చేసేందుకైనా సిద్ధమని ట్రంప్ చెప్పారు.
Network news has become so partisan, distorted and fake that licenses must be challenged and, if appropriate, revoked. Not fair to public!
— Donald J. Trump (@realDonaldTrump) October 12, 2017
Comments
Please login to add a commentAdd a comment