
వాషింగ్టన్: అమెరికా మరోసారి షట్‌డౌన్ అయింది. కీలకమైన బిల్లుకు అమెరికా సేనేట్‌లో మరోసారి వీగిపోవడంతో మూడువారాల్లో రెండోసారి ప్రభుత్వం స్థంభించింది. దీంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. సేనేట్‌తో పాటు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది.
కాంగ్రెస్(సేనేట్, హౌజ్ ఆఫ్ కామన్స్), వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉన్నా.. షట్‌డౌన్ లాంటి పరిస్థితిని రెండోసారి ఎదుర్కోవల్సి రావడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బేనని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా జనవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment