
వాషింగ్టన్ : అమెరికా శాస్త్ర, వైద్య విజ్ఞానంతో చైనా వైరస్ కరోనాని అంతమొందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా బారిన పడ్డ ట్రంప్ మిలటరీ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స తీసుకొని వచ్చిన అనంతరం శనివారం వైట్‌హౌస్ బాల్కనీ నుంచి తన మద్దతుదారులనుద్దేశిం చి మాట్లాడారు. తను ఇప్పుడు చాలా బాగున్నానని చెప్పారు. తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా శాస్త్రవేత్తలు తమ శక్తికి మించి పని చేస్తున్నారని త్వరలోనే వ్యాక్సిన్ వచ్చి కరోనా మాయమైపోతుందని అన్నా రు. ఈ సందర్భంగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికాని సోషలిస్టు దేశంగా మారుస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వమన్నారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం పెన్సిల్వేని యా, లోవాలో ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ట్రంప్ నుంచి వైరస్ సోకదు
అధ్యక్షుడు ట్రంప్ 14 రోజుల క్వారంటైన్ పూర్తి కాకుండానే జనంలోకి రావడం, మాస్కు లేకుండా కూడా మాట్లాడడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు సియాన్ కాన్లే వివరణ ఇచ్చారు. ట్రంప్ నుంచి ఇతరులకి ఇక వైరస్ సోకదని స్పష్టం చేశారు. ఆయనకు జ్వరం రావడం లేదని, క్రియాశీలకంగా మారే వైరస్ కణాలేవీ ఆయన శరీరంలో లేవని చెప్పారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ సీడీసీ నిబంధనల ప్రకారం ట్రంప్ ఐసొలేషన్ నుంచి బయటకు రావచ్చునని తెలిపారు. అయితే కరోనా పరీక్షల్లో ట్రంప్‌కి నెగిటివ్ వచ్చిందా లేదా అన్న దానిపై కాన్లే స్పష్టతనివ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment