వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్‌లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్‌కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా
Comments
Please login to add a commentAdd a comment