
ట్రంప్ ఉంటాడా?.. ఊడతాడా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాభిశంసన తీర్మానం ద్వారా వైదొలుగుతారా? లేదా?. ఈ ప్రశ్నపై ఆన్‌లైన్‌లో అత్యధికంగా బెట్టింగ్‌లు జరగుతున్నాయి. ఆన్‌లైన్ పొలిటికల్ స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్‌ఇట్‌లో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నపై ఎక్కువ మంది బెట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు లక్షకు పైచిలుకు మంది ప్రెడిక్ట్‌ఇట్‌లో ట్రంప్ ప్రశ్నపై బెట్ చేశారు.
గత వారంలో ట్రంప్ అభిశంసనకు గురవుతారని ప్రెడిక్ట్‌ఇట్‌లో 7గా ఉన్న ఓట్ల శాతం.. బుధవారం ఒక్కరోజే 33 శాతానికి వెళ్లింది. సాయంత్రానికి మళ్లీ తగ్గి 24 శాతానికి చేరింది. ప్రెడిక్ట్‌ఇట్‌ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్‌టన్‌లు నిర్వహిస్తున్నాయి. ఇందులో రిజిస్టర్ అయినవారందరూ అమెరికన్లే. ఎక్కువ మంది బెట్టర్లు ట్రంప్ పూర్తి కాలం పదవిలో కొనసాగరని 5 వేల డాలర్లు బెట్ చేసినట్లు బుక్‌మేకర్ పాడీ పవర్ బెట్‌ఫెయిర్ చెప్పింది.