![People Protest For Arrest Of Fraud Baburao In Khammam - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/10/Babu-Rao.jpg.webp?itok=aBz_w5tV)
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పలువురు వ్యాపారులను రూ. కోట్లలో ముంచుతున్న సత్తుపల్లికి చెందిన ఘరానా కేటుగాడు బాబురావు ఆగడాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. వందలాది మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వైనంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద వచ్చి కొత్త మోసాలకు పాల్పడుతున్నాడని, ఇంటీరియర్ కంపెనీ కోసం సరుకులు కావాలని వ్యాపారులకు డబ్బులు ఎగనామం పెట్టాడని తెలిపారు. మినరల్ వాటర్ కంపెనీలలో వాటాల పేరుతో లక్షలు లూఠీ చేశాడని, డబ్బులు అడిగిన బాధితులపై భార్యతో లైంగిక వేదింపుల కేసులుపెడుతున్నాడని పేర్కొన్నారు.
నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సీసీఎస్, సీఐడీ, విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఇలా వందల కేసులు పెట్టాడని తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కనుబొమ్మలు తీసేయడం, గడ్డం స్టైల్ మార్చడం, టోపీలు పెట్టడం రకరకాల వేషాలు మర్చాడంలో దిట్ట అని చెప్పారు. బాబురావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment