
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతరిక్షంలో చిక్కుకుపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఆయన సన్నిహితుడు ఇలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాల వల్లే సునీతా విలియమ్స్,విల్మోర్‌లను బైడెన్ అంతరిక్షంలో వదిలేశారని చెప్పారు. మంగళవారం(ఫిబ్రవరి 18)ట్రంప్, మస్క్ సంయుక్తంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు వ్యోమగాములిద్దరిని నాలుగు వారాల్లో భూమికి తీసుకువస్తామని మస్క్ తెలిపారు. గతంలో చాలా మంది వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన చరిత్ర తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీకి ఉందన్నారు. ఇంతలో ట్రంప్ జోక్యం చేసుకుని వారిని త్వరగా తీసుకు రావాలని మస్క్‌ను కోరారు.
గతంలో బైడెన్ వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ‘స్పేస్ ఎక్స్’కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని ట్రంప్ చెప్పారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి(ఐఎస్‌ఎస్) 10 రోజుల కోసం వెళ్లిన సునీత,విల్మోర్‌లు బోయింగ్ వ్యోమనౌకలో సమస్యల వల్ల ఇప్పటికీ భూమికి తిరిగి రాలేదు. వీరిని మార్చి మొదటి వారంలో మస్క్‌కు చెందిన స్పేస్ క్స్ క్రూ డ్రాగన్ భూమికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment