క్లీవ్ లాండ్: రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ జాన్ ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నవంబర్ లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైనట్లయింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో ట్రంప్ తలపడనున్నారు.
రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో ట్రంప్ వినూత్నరీతిలో ప్రచారాన్ని సాగించి పార్టీలోని సీనియర్లను ఓడించి అత్యధికంగా 1,725 ఓట్లను పొందారు. బుధవారం ట్రంప్ తన అంగీకార ప్రసంగాన్ని క్లీవ్ లాండ్ లో చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమెరికాను ఎప్పుడూ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుపడానికి కృషి చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
అధికారికంగా ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు
Published Wed, Jul 20 2016 9:18 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement