రిపబ్లికన్లతో ఒబామా చర్చలు విఫలం
అమెరికా 'షట్ డౌన్' సంక్షోభాన్ని నివారించేందుకు బరాక్ ఒబామా చేసిన ప్రయత్నాలు కొలిక్కి
రాలేదు. రాజకీయ ప్రత్యర్థులు రిపబ్లికన్స్ తో ఒబామా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫెడరల్ బడ్జెట్ పై సుమారు 90 నిమిషాల పాటు ఒబామా, రిపబ్లికన్ల మధ్య చర్చలు కొనసాగాయి.
అయితే సమస్య కొలిక్కి రాలేదని.. అయితే పురోగతి ఉంది అని రిపబ్లికన్లు తెలిపారు. ఈ సమావేశానికి స్పీకర్ జాన్ బోనెర్ తోపాటు 20 మంది రిపబ్లికన్లు హాజరయ్యారు. అయితే చర్చలు విఫలం కావడంతో గత పది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడలేదు.
మధ్య తరగతి వర్గాలను సంక్షేమం కోసం, ఉద్యోగాల కల్పనకు, అర్ధిక వృద్ధి పెంపు అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపార కార్యాకలాపాలను కొనసాగించేలా చూడాలని.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము అన్ని చర్యలు తీసుకుంటామని ఒబామా తెలిపినట్టు వైట్ హౌజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.