వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మరికొద్ది గంటల్లో ప్రారంభమవనుంది. ఈ నెల 15వ తేదీన అయోవాలో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీ బ్యాలెట్(కోకస్) జరగనుంది. అయితే ఈ ప్రైమరీలలో ఎన్ని ఓట్లు పోలవుతాయన్నదానిపై పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయోవాలో జీరో డిగ్రీ ఫారెన్‌హీట్ కిందకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఇక్కడ భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందో అని అభ్యర్థులు టెన్షన్ పడిపోతున్నారు. తక్కువ ఓటింగ్ శాతం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎవరికి వారు ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్ జరిగే ఈ నెల 15వ తేదీన రాత్రి రికార్డుస్థాయి చలి ఉంటుందని జాతీయ వాతావరణ సర్వీసుల డేటా చెబుతోంది.
ఇప్పటికే ఇక్కడ ఉన్న రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు వల్ల రోడ్లు బ్లాక్ అయి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అగ్ర నేతలు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తమ ప్రచార ఈవెంట్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment