అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్‌బీఐపై ‘మెమో’ విడుదల చేశారు. ఎఫ్‌బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటని ట్రంప్ అన్నారు.