
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు.
ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు
Comments
Please login to add a commentAdd a comment