Marlon James
-
ఇదేం ఇండియా!
ఇండియాలో దిగితే ఇన్ని ఇబ్బందులా బాబూ! అంటున్నాడు మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత మార్లోన్ జేమ్స్. ఈ జమైకా రచయిత జైపూర్ సాహిత్యోత్స వానికి వచ్చారు. జేమ్స్, బ్రిటిష్ రచయిత ప్యాట్రిక్ ఫ్రెంచ్‌లతో కలిపి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తే, అందులో తను పడిన బాధలన్నీ వివరించాడాయన. ఢిల్లీలో దిగగానే అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి, దేశీయ విమానాలు వచ్చి పోయే విమానాశ్రయానికి వెళ్లడానికి తల ప్రాణం తొకకు వచ్చిందని జేమ్స్ తిట్టి పోశాడు. ఆ రెండు విమానాశ్రయాల మధ్య ప్రయాణం పెట్టిన ఇక్కట్లకు తోడు ఒక విమానం ఆలస్యంగా ప్రయాణించి మరింత విసుగును కలిగించిందని చెప్పా రాయన. ఇదేం ఇన్క్రెడిబుల్ ఇండియా అని కూడా వాపోయాడు. ఈ వివాదం గురించి జేమ్స్ పుస్తకాలు అచ్చువేసే సంస్థ ఏమీ మాట్లాడలేదు. ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ అనే ఆయన నవలకు నిరుడు బుకర్ పురస్కారం వచ్చింది. జేమ్స్ గారూ ఇలాంటి ఇబ్బందులు ప్రపం చంలో ఎక్కడైనా ఉంటాయని వెంటనే ట్వీట్లు మొదలైనాయి. భారతదేశం ఇప్పుడు ఎవరు వచ్చినా అసహనంతోనే ఉంటారు కాబోలు. -
జమైకా రచయితకు మ్యాన్ బుకర్
లండన్: ప్రముఖ జమైకా నవలా రచయిత మార్లన్ జేమ్స్ చరిత్ర లిఖించుకున్నారు. ఈ ఏడాది(2015) ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ సొంతం చేసుకొని చరిత్ర కెక్కారు. జమైకా నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచారు. ప్రతి ఏడాది కాల్పనిక సాహిత్య రచనా విభాగంలో మన్ బుకర్ సంస్థ ఈ అవార్డును అందిస్తుంది. ఈ ఏడాది మొత్తం ఆరుగురి ఫిక్షన్ స్టోరీలు తుది నామినీలుగా నిలవగా అందులో మార్లన్ జేమ్స్ ఫిక్షన్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' ప్రైజ్ దక్కించుకుంది. ఈ అవార్డు కోసం పోటి పడిన వారిలో భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సంజీవ్ సహోతా కూడా ఉన్నాడు. 1970లో బాబ్ మార్లీలో జరిగిన మారణ హోమాన్ని తన నవలకు ప్రాథమిక అంశంగా తీసుకొని 686 పేజీల్లో మార్లన్ జేమ్స్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' రాశాడు. లండన్‌లోని గిల్డ్ హాల్లో గతరాత్రి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 1969లో స్థాపించారు. ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో విశిష్ట రచనలు చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. తుది నామినీలుగా ఎంపికైన రచనలు ఇవే.. 'బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్'..మార్లన్ జేమ్స్(జమైకా) సాటిన్ ఐస్ లాండ్-టామ్ మెక్ కార్తీ(బ్రిటన్) ది ఫిషర్ మెన్-చిగోజి ఒబియోమా(బ్రిటన్) ది ఇర్ ఆఫ్ ది రునావేస్- సంజీవ్ సహోతా(బ్రిటన్- భారతీయ సంతతి పౌరుడు) ఏ స్పూల్ ఆఫ్ బ్లూ థ్రెడ్-అన్నే టేలర్(అమెరికా) ఏ లిటిల్ లైఫ్-హన్యా యానాగిహారా(అమెరికా)