‘మహా’ పోరు: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?     | Who Will Be The Winner In Maharashtra Assembly Elections 2024? Know Exit Polls Predictions | Sakshi
Sakshi News home page

Maharashtra Elections 2024: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?    

Published Fri, Nov 22 2024 2:27 PM | Last Updated on Fri, Nov 22 2024 3:45 PM

 Maharashtra Election 2024 Who will be the winner

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై  పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ 

మహాయుతి, మహావికాస్‌ ఆఘాడీలు పోటాపోటీగా సీట్లు దక్కించుకుంటాయని అంచనా 

అదే జరిగితే హంగ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేయక తప్పదని ‘సర్వే’జనుల అభిప్రాయం 

సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23వ తేదీ (శనివారం) వెలుపడను న్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌షాహీ, రిపబ్లిక్‌ , చాణక్య, పోల్‌డైరీ వంటి అనేక సంస్ధలు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు నిర్వహించాయి. మహాయుతిదే మళ్లీ అధికార పీఠమని కొన్ని సర్వేలు వెల్లడించగా, మరి కొన్ని సర్వేలు మాత్రం మహావికాస్‌ ఆఘాడి కూటమి అ«ధికారంలో రానుందని పేర్కొన్నాయి.  

మహా వికాస్‌ ఆఘా డీకి 124 నుంచి 156 స్థానాలు లభించనున్నాయని, మహాయుతి కూటమికి 129 నుంచి 150 స్థానాలు, ఇతరులు 10 స్థానా ల్లో గెలిచే అవకాశముందని లోక్‌షాహీ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలాఉండగా మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్‌ ఆఘాడీకి 126 నుంచి 146 స్థానాలు లభించే అవకాశాలున్నాయని రిపబ్లిక్‌ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారపీఠమెక్కేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement