Maharashtra: తొలిసారిగా అసెంబ్లీకి 78 మంది.. | 78 New MLAs Won For The First Time In Maharashtra Assembly Elections, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా గెలుపు

Published Thu, Nov 28 2024 9:51 AM | Last Updated on Thu, Nov 28 2024 11:11 AM

Maharashtra Elections: 78 New MLAs Elected To Assembly

సాక్షి ముంబై: రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా విజయం సాధించారు. దీంతో ఈ 78 మంది మొదటిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు . మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకుగాను ఒక విడ తలా నవంబరు 30వ తేదీ ఎన్నికలు జరగగా నవంబరు 23వ తేదీ ఫలితాలు వెలువడ్డ సంగతి. తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. 

బీజేపీకి 1152, శివసేన (షిండే)కు 57, ఎన్సీపీ (ఏపీ)కి 41 స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఈసారి గెలుపొందిన అభ్యర్థులలో 78 మంది మొదటిసారిగా విజయం సాధించి అసెంబ్లీకి వెమెట్లెక్కనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 33 మంది, శివసేన (ఉంటే) నుంచి 14 మంది, ఎన్సీపీ (ఏపీ)కి చెందిన ఎనిమిది మంది. శివసేన (యూబీటి)కి చెందిన 10 మంది, కాంగ్రెస్ నుంచి ఆరు. ఎన్సీపి (ఎస్పీ)కి చెందిన నలుగురు అభ్యర్థులున్నారు. వీరితోపాటు చిన్న పార్టీలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులతోపాటు ఒక ఇండిపెండెంటు కూడా ఉన్నారు. 

ఈ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్‌ అఘాడికి చెందిన నేతలు తమ వారసులను బరిలోకి బరిలోకి దింపినప్పటికీ ప్రజలు అందరికీ పట్టంకట్టలేదని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన వారసులలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతుడు శ్రీ జయా చవాన్ నాందేడ్ జిల్లా బోకర్ అసెంబ్లీ సియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ లేని విజయం సాధించారు. 

మరోవైపు మాజీ మంత్రి బాబన్ రాన్ పాచ్‌పుతే సుమారుడు విక్రమ్ శ్రీగోంధా నుంచి మాజీ ఎంపీ హరిభావు జూవలే కుమారుడు అమోల్ జావలే రావేర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీవేసి విజయం సాధించారు

ఇదిలా ఉండగా ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యక్తిగత సహాయకుడైన సుమిత్‌ వాంఖడ, అదుల బాబా భోస్లే కరాడ్‌ నుంచి విజయం సాధించారు. అదే విధంగా శిసేన(షిండే) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనీల్‌ బాబర్‌ కుమారుడు సహాస్‌ బాబర్‌ ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందగా ఎంపీ సందీపన్‌ భూమరే కుమారుడు విలాస్‌ భూమరే పైఠన్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్చే చిమణరావ్‌ పాటిల్‌ కుమారుడు అమోల్‌ పాటిల్‌ ఎరండోల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించారు.

ఇక ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ కుమార్తె సనా మాలిక్‌ ముంబైఓలని అణుశక్తినగర్‌ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. వీరితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి వర్షా గైక్వాడ్‌ సోదరీ జ్యోతి గైక్వాడ్‌ కూడా ధారావీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా  గెలుపొందారు. వీరితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి, దివంగత ఆర్‌ ఆర్‌ పాటిల్‌ కుమారుడు ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున తాస్‌ గావ్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు.  మరోవైపు తూర్పు బాంద్రా అసెంబ్లీ  నుంచి శివసేన(యూబీటీ) తరపున ఉద్దవ్‌ ఠాక్రే బంధువైన వరుణ్‌ దేశామ్‌ మొదటిసారిగా విజయం సాధించారు.

ముంబై నుంచి తొమ్మిది మంది..
ఈ ఎన్నికల్లో ముంబై నుంచి తొమ్మిది. అభ్యర్థులు తొలిసారిగా విజయం సాధించిన వీరిలో మాహిం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి  నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) అధక్షుడు రాజ్ కాక్రే కుమారుడైన అమిత్‌ ఠాక్రే తొలిసారిగా బరిలోకి దిగగా శివసేన(షిండే) నుంచి సదా సర్వస్కర్‌, శివసేన(యూబీటీ) నుంచి మహేష్ సావంత్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య భారీగా ఓట్లు చీలి మహేష్ సావంత్ విజ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement