అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాగులు తనిఖీ చేయటం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సోమవారం యావత్మాల్‌లో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారలు సోదా చేయటం వివాదం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల లగేజీని ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీ చేస్తారా? అని నిలదీశారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లను కూడా విమానాశ్రయ అధికారులు అదే విధంగా తనిఖీ చేసిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కొందరు నాయకులకు ప్రదర్శనలు ఇవ్వడం అలవాటని పేర్కొంది. ‘‘రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకువెళ్లడం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ ప్రక్రియలను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బీజేపీ తెలిపింది. ఇక.. నవంబర్ 5న కొల్హాపూర్ విమానాశ్రయంలో ఫడ్నవీస్ బ్యాగ్‌ని అధికారులు తనిఖీ చేశారు.
जाऊ द्या, काही नेत्यांना तमाशा करण्याची सवयच असते!
हा व्हीडिओ पहा, 7 नोव्हेंबरला यवतमाळ जिल्ह्यात आमचे नेते मा. देवेंद्रजी फडणवीस यांच्या बॅगची तपासणी झाली. पण, त्यांनी ना कोणता व्हीडिओ काढला, ना कोणती आगपाखड केली. तत्पूर्वी, 5 नोव्हेंबर रोजी कोल्हापूर विमानतळावर सुद्धा मा.… pic.twitter.com/ebkuigJE2E— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 13, 2024
మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే బ్యాగు తనికీ చేయటంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికలవేళ ప్రామాణిక నియమావళి(ఎస్‌ఓపీ) మేరకే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈసీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment