రియో స్క్వాడ్లో బోల్ట్! | Usain Bolt Reportedly Named in Jamaica Squad For Rio Olympics Despite Injury | Sakshi
Sakshi News home page

రియో స్క్వాడ్లో బోల్ట్!

Published Sat, Jul 9 2016 4:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

Usain Bolt Reportedly Named in Jamaica Squad For Rio Olympics Despite Injury

కింగ్స్టన్: రియో ఒలింపిక్స్ కు వెళ్లే జమైకా జట్టులో ఆ దేశ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ కు స్థానం కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. రియోకు వెళ్లే జమైకా జట్టును సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ స్టార్ స్ప్రింటర్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది.  జమైకా ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు.  బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. దీంతో రియోకు బోల్ట్ దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. 

 

కాగా, తాను రియో ఒలింపిక్స్లో పాల్గొనడానికి ప్రస్తుత గాయం ఏమాత్రం అడ్డుకాబోదని బోల్ట్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రియోకు వెళ్లే జమైకా జట్టులో బోల్ట్ పేరును పరిగణించాలని ఆ దేశ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.  అయితే దీనికి ముందు లండన్ లో జరిగే యూనివర్శల్ గేమ్స్లో బోల్ట్ పాల్గొని రియోకు అర్హత సాధించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement