జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్ | Usain Bolt sets last race in Jamaica for June | Sakshi
Sakshi News home page

జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్

Published Sat, Oct 15 2016 3:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్

జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్

కింగ్స్టన్: పరుగుల వీరుడు, జమైకా స్టార్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ తన దేశంలో పాల్గొనబోయే చివరి రేసును ప్రకటించేశాడు. స్వదేశంలో వచ్చే జూన్ లో జరిగే రేసర్స్ గ్రాండ్ ప్రినే తనకు అక్కడ ఆఖరి రేసు అని బోల్ట్ స్ఫష్టం చేశాడు. ఇప్పటికే లండన్ లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ తో తన రేసింగ్ కెరీర్కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించిన బోల్ట్.. జమైకాలో పాల్గొనే ఆఖరి రేసును కూడా వెల్లడించాడు.

 

'రేసర్స్ గ్రాండ్ ప్రినే జమైకా ప్రజల సమక్షంలో పాల్గొనబోయే ఆఖరి రేసు. ఆ తరువాత ఇక్కడ నా పరుగు ఉండదు'అని బోల్ట్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రిలో బోల్ట్ 100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాది కూడా ఇదే ఫామ్ ను చాటుకుని విజయంతో తన ప్రజలకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement