జమైకా : జమైకాకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌గేల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక వీడియోలో గేల్ మాట్లాడుతూ ‘ కోవిడ్-19 వ్యాక్సిన్ విరాళంగా ఇచ్చినందుకు ప్రధాని మోదీ, భారత ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమైకన్లు ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. భారత అభిమానులను నేను త్వరలోనే కలుస్తాను’ అని అన్నారు. భారతదేశం గేల్‌కు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఉండటానికి అతడు చాలా ఇష్టపడతాడని చెప్పిన విషయాన్ని జమైకాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా ట్వీట్ చేసింది.
‘జమైకన్ వీరుడి సుడిగాలి బ్యాటింగ్ మాకు ఎల్లపుడు ఆనందాన్ని ఇస్తుంది. భారత ప్రజలు గేల్ విధ్వంసకర బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ మైత్రి పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా స్నేహితులకు వ్యాక్సిన్ల్‌ను పంపడం మాకు ఆనందంగానే ఉంది’’ అంటూ గేల్ మాటలకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ వేదికగా స్పందించారు. కాగా మానవతా దృక్ఫథంతో భారత ప్రభుత్వం ‘ వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా COVID-19 వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందిస్తోంది. ఇక కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్, ఆండ్రీ రసెల్ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ( చదవండి : 'గేల్.. నీలాగా నాకు కండలు లేవు' )
Comments
Please login to add a commentAdd a comment