బ్రావో(ఐపీఎల్‌లో), సామీ (పీఎస్‌ఎల్‌లో)
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో వైవిధ్యమైన డ్యాన్స్‌లతో ఆడుతూ..పాడుతూ ప్రేక్షకులను అలరించే విషయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. వినూత్నమైన డ్యాన్స్‌లను పరిచయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఇలాంటి డ్యాన్స్‌లను విండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో ఐపీఎల్‌లో మనకెన్నో సార్లు చూపించాడు. అయితే పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఈ బాధ్యతను మరో ఆల్‌రౌండర్ డారెన్ సామీ తీసుకున్నాడు.
తన ఆట పాటతో చిందేస్తూ అభిమానులు, తోటి ఆటగాళ్లలో జోష్ నింపుతున్నాడు. ఈ లీగ్‌లో పెష్వార్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ ఆల్ రౌండర్ తమ జట్టు ఫైనల్‌కు చేరిందన్న ఆనందంతో తోటి దేశవాళి ఆటగాడైన ఆండ్రూ ఫ్లెచర్‌తో కలిసి హోటల్ గదిలో సందిడి చేశాడు. ఫేమస్ బ్రిటీష్ కమెడియన్ మైఖల్ డపా ఆలపించిన ‘మ్యాన్స్ నాట్ హాట్’ అనే ర్యాప్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ ఇరగదీశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్ లీగ్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగగా.. ఫైనల్ మ్యాచ్‌కు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం జరిగే తుది పోరులో పెష్వార్ జల్మీ, ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment