
సాక్షి, హైదరాబాద్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ప్రేక్షకులకు అమ్మకానికి ఉంచారు. నేటి (బుధవారం) నుంచి ఈ టికెట్లు ఆన్‌లైన్ eventsnow.com)తో పాటు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో లభిస్తాయి. ఒక రోజు ఆటకు సంబంధించి కనిష్ట ధర రూ. 100 కాగా, గరిష్టంగా రూ.1000గా నిర్ణయించారు.
ఐదు రోజుల కోసం ఒకే సారి సీజన్ టికెట్ కొనుక్కుంటే రూ. 300 నుంచి రూ. 3000 వరకు విలువ గల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం కేవలం 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లుగా నిర్ణయించారు. దాంతో దాదాపు 39 వేల సామర్థ్యం గల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సుమారు 35 వేల వరకు టికెట్లు ప్రేక్షకులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment