
సాక్షి, హైదరాబాద్: మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి వన్డే కోసం నేటి నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నేరుగా కౌంటర్లలో టికెట్లు అమ్మనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ఈనెల 11 నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండగా... ఇప్పటికే కొన్నవారు 23 నుంచి జింఖానా మైదానంలోనే వాటిని ‘రిడీమ్’ చేసుకొని అసలు టికెట్లను పొందవచ్చని హెచ్‌సీఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment