
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతీసారి తనదైన సెలబ్రేషన్‌తో అభిమానులను అకట్టుకుంటాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన కాట్రెల్.. కరోనా బారిన పడడంతో ఒక్క మ్యాచ్‌కూడా ఆడకుండా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కాట్రెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన డ్రీమ్ హ్యాట్రిక్‌లో భాగం కావాలనుకుంటున్న ముగ్గురు బ్యాటర్ల గురించి అడిగినప్పుడు, కాట్రెల్ దానికి బదులుగా... “క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. మూడో వికెట్‌గా కోహ్లి వికెట్ సాధించడం నిజమైన డ్రీమ్ హ్యాట్రిక్ లాంటిది"అని తెలిపాడు.
కాగా ఇటీవల జరిగిన అబుదాబి టీ10లీగ్‌లో టీమ్ అబుదాబి జట్టు తరుపున ఆడాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఘోర పరాభావం మూటకట్టుకుంది. అతిథ్య పాకిస్తాన్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మరో వైపు వెస్టిండీస్ జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో వన్డే సిరీస్ వాయిదా పడింది.
చదవండి: Mohammad Rizwan: ఇంగ్లండ్‌లో ఆడనున్న పాక్ స్టార్ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment