Sheldon Cottrell
-
రసవత్తర సమరం.. సౌతాఫ్రికా బ్యాటర్ ఉగ్రరూపం.. పొట్టి క్రికెట్లో అద్భుతం
జింబాబ్వే టీ10 లీగ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. బ్యాటింగ్‌లో హరారే హరికేన్స్ ఆటగాడు డొనవాన్ ఫెరియెరా (33 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) నిర్ణీత బంతుల్లో సగానికిపైగా ఎదుర్కొని బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించగా.. బౌలింగ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ బౌలర్, విండీస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ తన కోటా 2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి, మరో ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లోనే మెయిడిన్ ఓవర్ వేయడం గగనమైపోయిన ఈ రోజుల్లో టీ10 ఫార్మాట్లో మెయిడిన్ వేసిన కాట్రెల్ రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. 60 బంతుల మ్యాచ్‌లో ఒకే బ్యాటర్ సగానికి పైగా బంతులు (33) ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ఓ రికార్డు కూడా. గతంలో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఎదుర్కొన్న 32 బంతులే టీ10 క్రికెట్లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యుత్తమం. తొలి ఓవర్ మెయిడిన్ అయ్యాక, ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బరిలోకి దిగిన ఫెరియెరా ఆఖరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి టీ10 ఫార్మాట్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్లో క్రిస్ లిన్ (30 బంతుల్లో 91; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. Best knock of #ZimAfroT10 💥 Our ZCC Player of the match is Donnovan Ferreira 🤝#CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/ypG0GZs4MJ — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 టీ10 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించి అత్యుత్తమ గణాంకాలు ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదు కావడం విశేషం. హరారే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఎదుర్కొన్న ఫెరియెరా.. కరీమ్ జనత్ బౌలింగ్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. తొలి బంతి డాట్ కాగా.. ఆఖరి 5 బంతులను ఫెన్సింగ్ దాటించాడు ఫెరియెరా. A peak at the how our 5️⃣ teams stand at the close of Day 5️⃣! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild pic.twitter.com/ZxldzNX3kE — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 అంతకుముందు ఓవర్లోనూ హ్యాట్రిక్ బౌండరీలు బాదిన ఫెరియెరా.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, ఆతర్వాత 8 బంతుల్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.హరికేన్స్ ఇన్నింగ్స్ ఫెరియెరా ఒక్కడే రాణించాడు. మరో ఆటగాడు జాంగ్వే (10 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశాడు. కేప్‌టౌన్ బౌలర్లలో కాట్రెల్ 3, నగరవా 2, హాట్జోగ్లూ ఓ వికెట్ పడగొట్టారు. టైగా ముగిసిన మ్యాచ్.. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్.. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (26 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టైగా ముగిసింది. అంత చేసి, ఆఖరి ఓవర్లో బొక్కబోర్లా పడిన కేప్‌టౌన్.. 116 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లలో 108 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉండిన కేప్‌టౌన్, ఆఖరి ఓవర్లో విజయానికి కావల్సిన 8 పరుగులు చేయలేక డ్రాతో సరిపెట్టుకుంది. తొలి 4 బంతులకు 6 పరుగులు వచ్చినా, చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయలేకపోయింది. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ వేసిన ఈ ఓవర్లో ఐదో బంతికి విలియమ్స్ రనౌట్ కాగా.. ఆఖరి బంతికి లెగ్ బై రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. First over in the tournament ☝️ 8 runs to defend 😬@sreesanth36 rolls the clock back to take the game to the Super over 😵💫 🕰️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/tMjN1FGdJw — ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023 సూపర్ ఓవర్లో హరికేన్స్ విజయం.. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. ఇక్కడ హరికేన్స్ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. వికెట్ కోల్పోయి 7 పరుగులు చేయగా.. హరికేన్స్ 5 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
పేలిన పోలార్డ్.. కేక పుట్టించిన కాట్రెల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥 Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్‌పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. 🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆ ముగ్గురు వికెట్లు పడగొట్టడమే నా డ్రీమ్ హ్యాట్రిక్...
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతీసారి తనదైన సెలబ్రేషన్‌తో అభిమానులను అకట్టుకుంటాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన కాట్రెల్.. కరోనా బారిన పడడంతో ఒక్క మ్యాచ్‌కూడా ఆడకుండా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కాట్రెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన డ్రీమ్ హ్యాట్రిక్‌లో భాగం కావాలనుకుంటున్న ముగ్గురు బ్యాటర్ల గురించి అడిగినప్పుడు, కాట్రెల్ దానికి బదులుగా... “క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. మూడో వికెట్‌గా కోహ్లి వికెట్ సాధించడం నిజమైన డ్రీమ్ హ్యాట్రిక్ లాంటిది"అని తెలిపాడు. కాగా ఇటీవల జరిగిన అబుదాబి టీ10లీగ్‌లో టీమ్ అబుదాబి జట్టు తరుపున ఆడాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఘోర పరాభావం మూటకట్టుకుంది. అతిథ్య పాకిస్తాన్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మరో వైపు వెస్టిండీస్ జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో వన్డే సిరీస్ వాయిదా పడింది. చదవండి: Mohammad Rizwan: ఇంగ్లండ్‌లో ఆడనున్న పాక్ స్టార్ క్రికెటర్.. -
వారెవ్వా కాట్రెల్.. స్టన్నింగ్ క్యాచ్.. ఆఖరి బంతికి సిక్స్
సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో భాగంగా బుధవారం సెంట్ కిట్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ఈ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో సూపర్ క్యాచ్‌తో పాటు ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన షెల్డన్ కాట్రెల్ విన్నింగ్ హీరోగా నిలిచాడు. బార్బడోస్ రాయల్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. డ్వేన్ బ్రావో వేసిన ఓవర్ తొలి బంతిని గ్లెన్ పిలిఫ్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న కాట్రెల్ ఒంటిచేత్తో అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రావో 4 వికెట్లు తీశాడు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. గేల్ 42 పరుగులు చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో కాట్రెల్, డ్రేక్స్ ఉన్నారు. తొలి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే రావడంతో.. నాలుగు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మూడో బంతికి డ్రేక్స్ బౌండరీ సాధించాడు. నాలుగు బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా... నాలుగో బంతికి డ్రేక్స్ ఔటయ్యాడు. దీంతో ఐదో బంతికి సింగిల్ రాగా.. చివరి బంతికి 3 పరుగులు చేస్తే చాలు అనుకుంటున్న దశలో కాట్రెల్ ఎవరు ఊహించని విధంగా లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్ సంధించాడు. దీంతో సెంట్ కిట్స్ లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన సెంట్ కిట్స్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. -
కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్ కోచ్‌గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మ్యాక్స్‌వెల్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. (చదవండి: 100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) -
సిక్సర్ల తెవాటియకు కోహ్లి కానుక
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న రాజస్తాన్ రాహుల్ తెవాటియను విరాట్ కోహ్లి అభినందించాడు. ఆటోగ్రాఫ్‌తో కూడిన తన జెర్సీని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి అతనికి కానుకగా ఇచ్చాడు. మరింత మెరుగ్గా రాణించాలని శుభాకాంక్షలు చెప్పాడు. ఇక పేవరెట్ ఆటగాడి నుంచి అందిన బహుమతిపై తెవాటియ ఆనందం వ్యక్తం చేశాడు. కోహ్లికి థాంక్స్ చెప్పాడు. ఈ ఫొటోను ఐపీఎల్ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. కాగా, పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ తెవాటియ కీలక ఇన్నింగ్స్‌తో ఛేదించిన సంగతి తెలిసిందే. ఓ దశలో 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతనిపై జిడ్డు బ్యాటింగ్ అంటూ విమర్శలు వచ్చాయి. ఇంత భారీ టార్గెట్ ముందు పెట్టుకుని ఇదేం ఆటరా నాయనా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తిట్టిపోశారు. అయితే, ఇన్నింగ్స్ చివరి సమయంలో అతను జూలు విదిల్చాడు. రవి బిష్ణోయ్ (15 వ ఓవర్) బౌలింగ్‌లో తొలి సిక్స్ బాదిన తెవాటియ.. 18 వ ఓవర్లో షెల్డన్ కాట్రెల్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 5 సిక్స్‌లు బాదడంతో రాజస్తాన్ గెలుపు ముంగిట నిలిచింది. షమీ వేసిన 19 ఓవర్లోనూ సిక్స్ బాదిన తెవాటీయ (31 బంతుల్లో 53, 7 సిక్స్‌లు) జట్టు స్కోరు సమం అయిన తర్వాత ఔట్ అయ్యాడు. మిగతా లాంఛనాన్ని టామ్ కరణ్ పూర్తి చేశాడు. ఇక మామూలుగా వికెట్ తీశాక సెల్యూట్ చేసే కాట్రెల్ ఈసారి రాహుల్ తెవాటియాకు సెల్యూట్ చేయకతప్పలేదని సోషల్ మీడియాలో అభిమానులు సరదా కామెంట్లు చేశారు. -
'ఐపీఎల్ నా దూకుడును మరింత పెంచనుంది'
దుబాయ్ : షెల్డాన్ కాట్రెల్... ఈ వెస్టిండీస్ పేసర్ గురించి మాట్లాడితే ముందుగా అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. 2019 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ తరపున 12 వికెట్లు పడగొట్టిన కాట్రెల్ .. ఆ జట్టులోనే ఉన్న కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, ఓషోన్ థామస్‌లను మించి యువ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.ముఖ్యంగా భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కాట్రెల్ టీమిండియా ఆటగాడి వికెట్ తీసిన ప్రతీసారి సెల్యూట్ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు. అందుకేనేమో గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసి కాట్రెల్‌కు ఘనంగా సెల్యూట్ చేసింది. సాధారణంగానే విండీస్ బౌలర్లు ఏ చిన్న ఆనందాన్నైనా తమ హావభావాలతో అభిమానులను కొల్లగొడుతుంటారు. డ్వేన్ బ్రోవో, డారెన్ సామి ఈ కోవకు చెందినవారే. గతంలో ఐపీఎల్లో వీరు చేసిన హంగామా మూములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు కాట్రెల్ వంతు వచ్చింది.. ఇప్పటివరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు మాత్రమే ఆడిన కాట్రెల్ కింగ్స్ తరపున ఐపీఎల్లో ఎంత ఎంజాయ్మెంట్ ఇవ్వనున్నాడో చూడాలి. తాజాగా నిర్వహించిన ఇంటర్య్వూలో 31 ఏళ్ల షెల్డన్ కాట్రెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') ఇదే మీకు మొదటి ఐపీఎల్.. మరి దీన్ని ఎలా ఆస్వాధిస్తారు ? ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న.. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్‌తో కలిసి బౌలింగ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కరీబియన్ లీగ్‌కు.. ఐపీఎల్‌కు చాలా తేడా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. మనమేంటనేది నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. అని తెలిపాడు. కింగ్స్ జట్టులోనే ఉన్న గేల్, నికోలస్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది.. వారి నుంచి ఏమైనా సలహాలు పొందారా? నా సహచరులైన క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌లు కింగ్స్‌లో ఉండడం కొంచెం ధైర్యమే అని చెప్పొచ్చు. అయితే గేల్‌తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదుగానీ.. అతను చాలా కూల్‌గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నికోలస్ పూరన్‌తో మాత్రం పలు క్రికెట్ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకుంటాం. ఈసారి ఐపీఎల్లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం మీకు కలిసి వస్తుందనుకుంటున్నారా? ఆ విషయం గురించి నేను చెప్పలేను.. ఎందుకంటే క్రికెట్లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో వివిధ రకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్ మాన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్‌నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు నా బౌలింగ్ ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నా. టీ20లో విజయవంతమైన బౌలర్‌గా పేరున్న క్రిస్ జోర్డాన్ వల్ల మీకు అవకాశాలు వస్తాయనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. క్రిస్ జోర్డాన్ అద్భుతమైన బౌలర్.. అలాగే మహ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు.ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా. ఐపీఎల్లో మీ సెల్యూట్స్ చూసే అవకాశం ఉంటుందా? నేను ఫేమస్ అయ్యందే సెల్యూట్ ద్వారా.. ఈ ఐపీఎల్లో కూడా నా సెల్యూట్స్ ఉంటాయి. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే సెల్యూట్ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని వదులుకోనూ. అంతేగాక క్రికెట్ అంటే సీరియస్‌నెస్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు తప్పనిసరిగా నా సెల్యూట్ చూసే అవకాశం ఉంటుంది. -
ఉత్కంఠ పోరు.. కాట్రెల్ ఫినిషింగ్ అదుర్స్
బార్బోడాస్: టీమిండియాతో జరిగిన పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లో చేదు అనుభవం చవిచూసిన వెస్టిండీస్.. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు వన్డేలను కైవసం చేసుకుని వన్డే సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అయితే ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 238 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని విండీస్ కేవలం బంతి మాత్రమే మిగిలి ఉండగా ఛేదించింది. టెయిలెండర్ హేడెన్ వాల్ష్-(46 నాటౌట్) అద్భుత పోరాటంతో ఆకట్టుకోగా, మరో టెయిలెండర్ షెల్డాన్ కాట్రెల్ సిక్స్‌తో విండీస్‌కు విజయాన్ని అందించాడు. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా, ఐర్లాండ్ వికెట్ సాధిస్తే గెలుపును అందుకుంటుంది. ఈ తరుణంలో వాల్ష్-కాట్రెల్ జోడి సమయోచితంగా ఆడింది. మార్క్ అడైర్ వేసిన 50 ఓవర్ తొలి బంతికి వాల్ష్ పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి పరుగు తీశాడు. ఇక మూడో బంతికి కాట్రెల్ సింగిల్ తీశాడు. నాల్గో బంతికి వాల్ష్ పరుగు తీయగా, కాట్రెల్ స్టైకింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి రెండు పరుగులు అవసరం. అయితే కాట్రెల్ మాత్రం సిక్స్‌తో అదిరేటి ఫినిషింగ్ ఇచ్చాడు. స్వీపర్ కవర్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. మ్యాచ్ చేజారిపోయిందనుకున్న తరుణంలో కాట్రెల్ సిక్స్ కొట్టడంతో విండీస్ శిబిరంలో ఆనందం అంబరాన్ని తాకింది. ఈ మ్యాచ్‌లో విజయంతో విండీస్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఒక ఆటగాడు ఛేజింగ్‌లో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి. -
ఈసారి ఐపీఎల్ వేలంలో వారిదే హవా
ఐపీఎల్ 2020కి సంబంధించి డిసెంబర్ 19న కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. ఈ సారి నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు వీదేశీ ఆటగాళ్లపై రూ.140.30 కోట్లు ఖర్చు చేశాయి. దీంట్లో అత్యధికంగా 13 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.58.25 కోట్లు వెచ్చించారు. తర్వాతి స్థానంలో రూ. 17.75 కోట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లు, రూ. 17.25 కోట్లతో కరేబియన్ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రూ. 15.50 కోట్లకు కేకేఆర్ దక్కించుకోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం గెలుచుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. మరో ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ రూ.10.75 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకోగా, నాథన్ కౌల్టర్‌నీల్‌ను ముంబయి ఇండియన్స్ రూ. 8 కోట్లకు దక్కించుకుంది. ఇక చివరిదాకా వేలంలో కొనసాగిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను మొదట్లో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ అనూహ్యంగా చివరి రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4. 80 కోట్లకు దక్కించుకోవడం విశేషం. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన ఆరోన్ పించ్‌ను ఆర్సీబీ రూ. 4.40 కోట్లకు దక్కించుకుంది. ఇక వేలంలో తీసుకున్న మిగతా ఆటగాళ్లను చూస్తే.. కేన్ రిచర్డ్సన్(ఆర్సీబీ), అలెక్స్ క్యారీ ( ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్(సన్‌రైజర్స్), క్రిస్ లిన్ ( ముంబయి ఇండియన్స్), అండ్రూ టై( రాజస్థాన్ రాయల్స్), టామ్ బాంటన్( కేకేఆర్), జూయిస్ ఫిలిప్ (ఆర్సీబీ), క్రిస్ గ్రీన్ (కేకేఆర్)లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయానికి వస్తే 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రూ. 5.50 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను రూ. 5.50 కోట్లతో చైన్నె సూపర్ కింగ్స్, అతని అన్న టామ్ కరణ్‌ను రూ. 1 కోటితో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్లలో క్రిస్ జోర్డాన్( కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), జాసన్ రాయ్, క్రిస్ వోక్స్ ( ఢిల్లీ క్యాపిటల్స్)లు ఉన్నారు. కరీబియన్ ఆటగాళ్లలో విండీస్ ఫాస్ట్‌బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, స్టార్ బ్యాట్సమెన్ షిమ్రన్ హెట్మైర్ను రూ. 7.75 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. కాగా ప్రతీసారి వేలంలో ముందుండే దక్షిణాప్రికా, న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈ సారి వేలంలో కొనడానికి ప్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను మాత్రమే రూ.10 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. డేల్ స్టేయిన్, డేవిడ్ మిల్లర్లు తమ బేస్ ప్రైస్‌కే ప్రాంచైజీలకు అమ్ముడుపోయారు. (చదవండి : ముగిసిన ఐపీఎల్ వేలం) (చదవండి : ఐపీఎల్ వేలం చరిత్రలోనే..) -
కాట్రెల్‌కు కింగ్స్ ‘భారీ’ సెల్యూట్
కోల్‌కతా: వెస్టిండీస్ పేసర్ షెల్డాన్ కాట్రెల్ గురించి ముందుగా చెప్పాలంటే అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తూ ఉంటుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఐపీఎల్ వేలంలో కాట్రెల్‌కు కింగ్స్ పంజాబ్ పెద్ద సెల్యూటే చేసింది. అతన్ని రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. భారత్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో కాట్రెల్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ ఇలా అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. పలు ఫ్రాంఛైజీలు కాట్రెల్‌కు కోసం పోటీ పడగా కింగ్స్ పంజాబ్ అతన్ని కొనుగోలు చేయడం విశేషం. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షాయ్ హోప్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న హోప్ విశేషంగా రాణిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో తాను భారీ ధర పలుకుతాననే నమ్మకంతో హోప్ ఉన్నాడు. కానీ అతనికి తొలి రౌండ్ వేలంలో అమ్ముడుపోలేదు. మరి చివర్లో హోప్‌పై ఏ ఫ్రాంఛైజీ అయినా దృష్టి పెడుతుందుమో చూడాలి. -
టీమిండియాకు షాకిచ్చిన కాట్రెల్
చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వరుస విరామాల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా కేఎల్ రాహుల్(6) ఔట్ కాగా, రెండో వికెట్‌గా విరాట్ కోహ్లి(4) పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్ పేసర్ కాట్రెల్ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి రాహుల్‌ను ఔట్ చేసిన కాట్రెల్.. ఆ ఓవర్ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు.(ఇక్కడ చదవండి: వన్డేల్లో శివం దూబే అరంగేట్రం) 122 కి.మీ వేగంతో కాట్రెల్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్‌లోకి రాహుల్ ఆడబోయాడు. అయితే అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హెట్మెయిర్ చేతుల్లో పడింది. దాంతో జట్టు స్కోరు 21 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను నష్టపోయింది. ఇక కోహ్లిది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఫోర్ కొట్టి ఊపు మీద ఉన్న కోహ్లిని కాట్రెల్ చక్కటి బంతితో పెవిలియన్‌కు పంపాడు. కాట్రెల్ తక్కువ ఎత్తులో వేసిన బంతిని థర్డ్ మ్యాన్ దిశగా పంపాలని కోహ్లి యత్నించగా అది కాస్తా మిస్ కావడంతో వికెట్లపైకి దూసుకుపోయింది. దాంతో జట్టు స్కోరు 25 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. -
కష్టపడి నెగ్గిన టీమిండియా..
ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో విజయం కోహ్లిసేన వైపే మొగ్గుచూపింది. దీంతో విండీస్ పర్యటనను కోహ్లి సేన విజయంతో ఆరంభించింది. విండీస్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పూర్తి చేసింది. ఛేదనలో రోహిత్ శర్మ(24), విరాట్ కోహ్లి(19), మనీష్ పాండే(19)లు పర్వాలేదనిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(1), రిషభ్ పంత్ (గోల్డెన్ డక్)లు ఘోరంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, సునీల్ నరైన్, కీమో పాల్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా యువ బౌలర్ నవదీప్ సైనీ(3/17) విండీస్ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. సైనీతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో విండీస్‌ను కట్టడి చేశారు. విండీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్(49; 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నికోలస్ పూరన్(20) ఫర్వాలేదనిపించాడు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. విండీస్ పతనాన్ని శాసించిన నవదీప్ సైనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.