బార్బోడాస్: టీమిండియాతో జరిగిన పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లో చేదు అనుభవం చవిచూసిన వెస్టిండీస్.. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు వన్డేలను కైవసం చేసుకుని వన్డే సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అయితే ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 238 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని విండీస్ కేవలం బంతి మాత్రమే మిగిలి ఉండగా ఛేదించింది. టెయిలెండర్ హేడెన్ వాల్ష్-(46 నాటౌట్) అద్భుత పోరాటంతో ఆకట్టుకోగా, మరో టెయిలెండర్ షెల్డాన్ కాట్రెల్ సిక్స్‌తో విండీస్‌కు విజయాన్ని అందించాడు. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరం కాగా, ఐర్లాండ్ వికెట్ సాధిస్తే గెలుపును అందుకుంటుంది.
ఈ తరుణంలో వాల్ష్-కాట్రెల్ జోడి సమయోచితంగా ఆడింది. మార్క్ అడైర్ వేసిన 50 ఓవర్ తొలి బంతికి వాల్ష్ పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి పరుగు తీశాడు. ఇక మూడో బంతికి కాట్రెల్ సింగిల్ తీశాడు. నాల్గో బంతికి వాల్ష్ పరుగు తీయగా, కాట్రెల్ స్టైకింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి రెండు పరుగులు అవసరం. అయితే కాట్రెల్ మాత్రం సిక్స్‌తో అదిరేటి ఫినిషింగ్ ఇచ్చాడు. స్వీపర్ కవర్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. మ్యాచ్ చేజారిపోయిందనుకున్న తరుణంలో కాట్రెల్ సిక్స్ కొట్టడంతో విండీస్ శిబిరంలో ఆనందం అంబరాన్ని తాకింది. ఈ మ్యాచ్‌లో విజయంతో విండీస్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఒక ఆటగాడు ఛేజింగ్‌లో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment