వారెవ్వా కాట్రెల్‌.. స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఆఖరి బంతికి సిక్స్‌ | Sheldon Cottrell Takes Left Handed Screamer And Stunning Six Last Ball | Sakshi
Sakshi News home page

Sheldon Cotrell: వారెవ్వా కాట్రెల్‌.. స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఆఖరి బంతికి సిక్స్‌

Published Fri, Sep 3 2021 4:18 PM | Last Updated on Fri, Sep 3 2021 4:23 PM

Sheldon Cottrell Takes Left Handed Screamer And Stunning Six Last Ball - Sakshi

సెంట్‌ కిట్స్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో భాగంగా బుధవారం సెంట్‌ కిట్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠను రేపింది. ఈ మ్యాచ్‌లో సెంట్‌ కిట్స్‌ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌తో పాటు ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షెల్డన్‌ కాట్రెల్‌ విన్నింగ్‌ హీరోగా నిలిచాడు. బార్బడోస్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. డ్వేన్‌ బ్రావో వేసిన ఓవర్‌ తొలి బంతిని గ్లెన్‌ పిలిఫ్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న కాట్రెల్‌ ఒంటిచేత్తో అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. స్మిత్‌ పటేల్‌ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సెంట్‌ కిట్స్‌ బౌలర్లలో డ్వేన్‌ బ్రావో 4 వికెట్లు తీశాడు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్‌ కిట్స్‌ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. గేల్‌ 42 పరుగులు చేశాడు. అయితే ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. క్రీజులో కాట్రెల్‌, డ్రేక్స్‌ ఉన్నారు. తొలి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే రావడంతో.. నాలుగు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మూడో బంతికి డ్రేక్స్‌ బౌండరీ సాధించాడు. నాలుగు బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా... నాలుగో బంతికి డ్రేక్స్‌ ఔటయ్యాడు. దీంతో ఐదో బంతికి సింగిల్‌ రాగా.. చివరి బంతికి 3 పరుగులు చేస్తే చాలు అనుకుంటున్న దశలో కాట్రెల్‌ ఎవరు ఊహించని విధంగా లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్స్‌ సంధించాడు. దీంతో సెంట్‌ కిట్స్‌ లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన సెంట్‌ కిట్స్‌ 10 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement