దుబాయ్ : షెల్డాన్ కాట్రెల్... ఈ వెస్టిండీస్ పేసర్ గురించి మాట్లాడితే ముందుగా అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తుంది. వికెట్ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. 2019 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ తరపున 12 వికెట్లు పడగొట్టిన కాట్రెల్ .. ఆ జట్టులోనే ఉన్న కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, ఓషోన్ థామస్‌లను మించి యువ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.ముఖ్యంగా భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కాట్రెల్ టీమిండియా ఆటగాడి వికెట్ తీసిన ప్రతీసారి సెల్యూట్ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు.
అందుకేనేమో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసి కాట్రెల్‌కు ఘనంగా సెల్యూట్ చేసింది. సాధారణంగానే విండీస్ బౌలర్లు ఏ చిన్న ఆనందాన్నైనా తమ హావభావాలతో అభిమానులను కొల్లగొడుతుంటారు. డ్వేన్ బ్రోవో, డారెన్ సామి ఈ కోవకు చెందినవారే. గతంలో ఐపీఎల్‌లో వీరు చేసిన హంగామా మూములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు కాట్రెల్ వంతు వచ్చింది.. ఇప్పటివరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు మాత్రమే ఆడిన కాట్రెల్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో ఎంత ఎంజాయ్‌మెంట్ ఇవ్వనున్నాడో చూడాలి. తాజాగా నిర్వహించిన ఇంటర్య్వూలో 31 ఏళ్ల షెల్డన్ కాట్రెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : ఆర్‌సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు')
ఇదే మీకు మొదటి ఐపీఎల్.. మరి దీన్ని ఎలా ఆస్వాధిస్తారు ?
ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న.. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్‌తో కలిసి బౌలింగ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కరీబియన్ లీగ్‌కు.. ఐపీఎల్‌కు చాలా తేడా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. మనమేంటనేది నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. అని తెలిపాడు.
కింగ్స్ జట్టులోనే ఉన్న గేల్, నికోలస్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది.. వారి నుంచి ఏమైనా సలహాలు పొందారా?
నా సహచరులైన క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌లు కింగ్స్‌లో ఉండడం కొంచెం ధైర్యమే అని చెప్పొచ్చు. అయితే గేల్‌తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదుగానీ.. అతను చాలా కూల్‌గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నికోలస్ పూరన్‌తో మాత్రం పలు క్రికెట్ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకుంటాం.
ఈసారి ఐపీఎల్‌లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం మీకు కలిసి వస్తుందనుకుంటున్నారా?
ఆ విషయం గురించి నేను చెప్పలేను.. ఎందుకంటే క్రికెట్‌లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో వివిధ రకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్ మాన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్‌నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు నా బౌలింగ్ ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నా.
టీ20లో విజయవంతమైన బౌలర్‌గా పేరున్న క్రిస్ జోర్డాన్ వల్ల మీకు అవకాశాలు వస్తాయనుకుంటున్నారా?
అలాంటిదేం లేదు. క్రిస్ జోర్డాన్ అద్భుతమైన బౌలర్.. అలాగే మహ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు.ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా.
ఐపీఎల్‌లో మీ సెల్యూట్స్ చూసే అవకాశం ఉంటుందా?
నేను ఫేమస్ అయ్యందే సెల్యూట్ ద్వారా.. ఈ ఐపీఎల్‌లో కూడా నా సెల్యూట్స్ ఉంటాయి. అభిమానులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే సెల్యూట్ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని వదులుకోనూ. అంతేగాక క్రికెట్ అంటే సీరియస్‌నెస్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. మీకు తప్పనిసరిగా నా సెల్యూట్ చూసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment