![Kiwis innings win - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/5/kiwis.jpg.webp?itok=KhDd7es8)
వెల్లింగ్టన్: పేస్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో... విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు పోరాటపటిమ కనబరిచిన విండీస్ బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు మాత్రం అదే ఆటతీరును పునరావృతం చేయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 214/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 105 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (91; 8 ఫోర్లు, ఒక సిక్స్) అవుటయ్యాక విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తీయగా... గ్రాండ్‌హోమ్, బౌల్ట్, వాగ్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 9న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment