ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా భారత జట్టును విజయం పథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్యకూమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 42 పరుగులు సాధించి రోహిత్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా రోహిత్ జట్టుకు అద్భుతమైన అరంభాన్ని ఇచ్చాడని సూర్యకూమార్ కొనియాడాడు. అదే విధంగా ఇలా దూకుడుగా ఆడడం రోహిత్‌కి కొత్త ఏమి కాదు అని అతడు తెలిపాడు. "రోహిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్ చూస్తోంది. రోహిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇన్నాళ్లూ ఎలా దూకుడుగా ఆడాడో, ఈ మ్యాచ్‌లో కూడా అదే విధంగా ఆడాడు. అతడి బ్యాటింగ్‌లో ఎటు వంటి మార్పు కనిపించడం లేదు.
రోహిత్ పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అదే విధంగా అతడికి ఒక సారథిగా జట్టును విజయ పథంలో నడిపించే సత్తా ఉంది" అని విలేకరుల సమావేశంలో సూర్యకూమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకూమార్ యాదవ్ 18 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా వరుస క్రమంలో కిషన్, కోహ్లి, పంత్ వికెట్లను భారత్ కోల్పోయి నప్పుడు యాదవ్ జట్టును ఆదుకున్నన్నాడు. వెంకటేష్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక భారత్- విండీస్ మధ్య రెండో టీ20 ఫిబ్రవరి 18న జరగనుంది.
చదవండి: IND Vs WI: జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
Comments
Please login to add a commentAdd a comment