Rohit Sharma-Request To Ishan Kishan Birthday Gift Tu Hum Ko Dey Bhai; Video Viral - Sakshi
Sakshi News home page

Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్‌ నువ్వే మాకు ఇవ్వాలి'

Published Wed, Jul 19 2023 12:08 PM | Last Updated on Wed, Jul 19 2023 1:02 PM

Rohit Sharma-Request To Ishan Kishan Birthday Gift Tu Hum ko Dey Bhai - Sakshi

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ జూలై 18న(మంగళవారం) పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇషాన్‌ కిషన్‌ వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే.  టీమిండియా ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ ఆడుతుంది. తొలి టెస్టులో ఇషాన్ కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

అతడు క్రీజులోకి వచ్చిన కాసేపటికే రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో రెండో టెస్ట్ బరిలోకి దిగనుండగా.. విరాట్‌ కోహ్లికి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఇషాన్ బర్త్ డే సందర్భంగా టీమిండియా క్రికెటర్లు అతనికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ఈ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ను.. బర్త్‌డే బాయ్‌ ఇషాన్‌కు ఏం గిఫ్ట్ ఇస్తారు అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించాడు. "ఏం బర్త్ డే గిఫ్ట్ కావాలట అతనికి? నీకేం కావాలి భాయ్? నీ దగ్గర అన్నీ ఉన్నాయ్. దీని గురించి టీమ్ను అడగాలి. టీమ్ అంతా కలిసి ఇస్తుంది. నువ్వే సెంచరీ కొట్టి మాకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలి" అని రోహిత్ శర్మ అనడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Asian Games 2023: వినేశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌ల వ్యవహారంపై హైకోర్టుకు అమిత్‌ పంఘల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement