ఆసియాకప్-2023 తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కావడంతో టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తుది జట్టు కూర్పు టీమ్ మేనేజ్‌మెంట్‌కు ప్రధాన సమస్యగా మారింది. రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎంట్రీ ఖాయం కావడంతో అతన్ని ఏ స్థానంలో ఆడించాలని జట్టు పెద్దలు తలలుపట్టుకున్నారు.
టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో (సెప్టెంబర్ 2) పాకిస్తాన్‌ను ఢీకొట్టాల్సి ఉండటంతో జట్టుపై ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కొందరు మాజీలు, అభిమానులు ఓ ఆసక్తికర ప్రతిపాదనను జట్టు పెద్దల ముందుంచారు. ఈ ప్రతిపాదన తుది జట్టు కూర్పు సమస్యను తీరుస్తుందని వారంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఓపెనింగ్ సమస్యతో పాటు మిడిలార్డర్ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ ప్రతిపాదన ఏంటంటే..?
శుభ్‌మన్ గిల్‌ను తప్పించి, తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకుంటే ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సి అవసరముండదని చెబుతున్నారు.
రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తే, వన్‌డౌన్‌లో విరాట్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో ప్లేస్‌లో తిలక్ వర్మ బరిలోకి దిగుతారని అంటున్నారు. ఇలా చేయడం వల్ల టాపార్డర్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో సమతూకంగా ఉంటుందని, దీని వల్ల సత్ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ గిల్‌ను తుది జట్టులో కొనసాగించాలని భావిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, పాక్‌తో మ్యాచ్‌లో ఇలాంటి సాహసాలు చేయకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. జట్టు కూర్పు సమస్యగా మారినప్పుడు ఎవరో ఒకరిని తప్పిస్తే సరిపోతుందనుకుంటే అలా చేయడమే మంచిదని, కాదని బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్ని మార్చే ప్రయోగం చేస్తే మిస్ ఫైరయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
గిల్‌ను కాదని తిలక్‌ను ఎందుకంటే..?
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోని అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అదే సిరీస్‌లో గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అభిమానులు గిల్ స్థానంలో తిలక్ పేరును ప్రతిపాదించేందుకు ఇది ప్రధాన కారణమైతే , తిలక్ లెఫ్ట్ హ్యండర్ కావడం అందులోనూ మిడిలార్డర్ బ్యాటర్ కావడం అతనికి అదనంగా కలిసొచ్చింది.
పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment