Who Will Be Team India Openers In Asia Cup And ODI World Cup 2023 - Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌లలో రోహిత్‌కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో యువ ఆటగాడు

Published Mon, Aug 14 2023 6:58 PM | Last Updated on Mon, Aug 14 2023 7:21 PM

Who Will Be Team India Openers In Asia Cup And ODI World Cup 2023 - Sakshi

టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్‌-గంగూలీ, సచిన్‌-సెహ్వాగ్‌, గంభీర్‌-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు  రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధవన్‌ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్‌ ఫామ్‌ కోల్పోవడం, కేఎల్‌ రాహుల్‌ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్‌ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్‌ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్‌ స్థానాన్ని ఆక్రమించాడు. 

అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్‌, సిరీస్‌కు కీలక ఆటగాళ్లను రెస్ట్‌ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్‌ హీరో శుభ్‌మన్‌ గిల్‌ తెరపైకి వచ్చాడు. రోహిత్‌కు జతగా గిల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి రాహుల్‌ను మరిపించాడు. అయితే గిల్‌ ఫామ్‌ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది.   

త్వరలో ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్‌-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో మరో యంగ్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్‌ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్‌ శిఖర్‌ ధవన్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది.

ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్‌ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, శిఖర్‌ ధవన్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌) లైన్‌లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement