Team india opening
-
ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్" మనకు అవసరమా..?
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో సమంగా నిలిచింది.రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్ గిల్ పేలవ ఫామ్ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి తన టీ20 కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.ఈ పేలవ ఫామ్ కారణంగానే అతను టీ20 వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్‌లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్‌కు ఎంపిక చేసింది. గిల్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్‌ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో గిల్ విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రేసులో నిలబడగలడా..?రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కొత్తగా శుభ్‌మన్ గిల్‌కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్ స్కోర్లు..జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20- 23 (12)సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)వెస్టిండీస్‌తో ఐదో టీ20- 9 (9)వెస్టిండీస్‌తో నాలుగో టీ20- 77 (47)వెస్టిండీస్‌తో మూడో టీ20- 6 (11)వెస్టిండీస్‌తో రెండో టీ20- 7 (9)వెస్టిండీస్‌తో తొలి టీ20- 3 (9) -
Rohit-Kohli: ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితేనే ఇలా జరిగింది..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా జత కట్టాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ జోడీ చెలరేగిపోయింది.2022 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు.అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్ ఓపెనర్‌గా స్థిరపడిన రోహిత్ సైతం ఆ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.వీరిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఆ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి-రోహిత్ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ స్కోర్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్ జోడీ ఒక్క మ్యాచ్‌లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఓపెనర్‌గా ఇదివరకే ప్రూవ్ చేసుకున్న విరాట్.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్‌గా అదిరిపోయే ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్ టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో (741 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్) ఉన్న కోహ్లి.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఓపెనర్‌గా విరాట్ కోహ్లి..?
ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లి గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ అవతారమెత్తినప్పటికీ, అది క్యాష్ రిచ్ లీగ్ వరకే పరిమతమైంది. గత సీజన్లో అతను ఓపెనర్‌గా పరుగుల వరద పారించినా, ఆతర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణల ప్రకారం ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లును ఎంపిక చేశారు. రోహిత్‌కు జతగా కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లి వన్‌డౌన్‌లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలామంది మాజీలు ప్రస్తావిస్తూ, కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి కోహ్లి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో లేదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 11, 14, 17 తేదీల్లో జరుగనుంది. చాలాకాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఫ్ఘన్‌తో సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఓపెనర్‌గా టీ20ల్లో విరాట్ గణాంకాలు.. 107 మ్యాచ్‌లు 107 ఇన్నింగ్స్‌లు 4011 పరుగులు 122 నాటౌట్ అత్యధిక స్కోర్ 44.56 సగటు 137.64 సగటు 8 శతకాలు 28 అర్ధశతకాలు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్..?
మెగా టోర్నీలైన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు ముందు టీమిండియాను చాలా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో తుది జట్టు కూర్పు ప్రధానమైన సమస్యగా ఉంది. మరి ముఖ్యంగా ఓపెనర్ల సమస్య టీమిండియా మేనేజ్మెంట్ను ఎక్కువగా వేధిస్తుంది. రోహిత్‌కు జతగా ఎవరిని బరిలోకి దించాలని యాజమాన్యం పెద్దలు తలలుపట్టుక్కూర్చున్నారు. ఈ విషయమై స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో డిస్కషన్ జరగ్గా ఇద్దరు భారత మాజీల మధ్య వాడివేడి చర్చ సాగింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌కు పంపాలని ప్రతిపాదించగా.. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ శుభ్‌మన్ గిల్‌కు వత్తాసు పలికాడు. తాజాగా విండీస్‌తో ముగిసిన సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఆసియా కప్ తుది జట్టులో ఓపెనర్‌గా ఆడించాలని రవిశాస్త్రి వాధిస్తే.. మూడు ఫార్మాట్లలో ఫామ్‌ను, అలాగే కంసిస్టెన్సీని పరిగణలోకి తీసుకుని శుభ్‌మన్ గిల్‌కు ఆ స్థానంలో అవకాశం ఇవ్వాలని సందీప్ పాటిల్ సూచించాడు. శాస్త్రి లెక్క ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందని అంటే.. రోహిత్ లెఫ్ట్ హ్యాండర్తో అంత కంఫర్టబుల్‌గా ఉండడని సందీప్ అన్నాడు. ఇందుకు ప్రతిగా స్పందించిన శాస్త్రి.. గిల్‌ను పూర్తిగా జట్టును తప్పించమని చెప్పట్లేదని, అతన్ని 3 లేదా 4 స్థానాల్లో ఆడిస్తే మంచిదని తెలిపాడు. శాస్త్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో ఎవరి స్థానాలు పర్మనెంట్ కాదని పరోక్షంగా కోహ్లి, రోహిత్‌ల బ్యాటింగ్ స్థానాలపై కామెంట్ చేశాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిస్కషన్‌ను ముగించాడు. రాహుల్, శ్రేయస్లతోనే తలనొప్పి.. కాగా, గాయాల నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్సీఏలో శ్రమిస్తున్న భారత స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వీరిద్దరు ఆసియా కప్ టీమ్ సెలెక్షన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా లేదా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. వీరి లేని లోటు ప్రస్తుతం భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వీరిరువురు ఆసియాకప్ టీమ్ సెలెక్షన్ సమయానికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాల్సి వస్తుంది. వీరికి ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లను పరిశీలించవచ్చు. ఒకవేళ ఇషాన్‌ను ఫైనల్ చేస్తే, అతన్ని ఓపెనర్‌గా పంపాలా లేక మిడిలార్డర్లో ఆడించాలా అన్నది మరో సమస్యగా మారుతుంది. ఈ ప్రస్తావన నేపథ్యంలోనే రవిశాస్త్రి, సందీప్ పాటిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. -
ఆసియా కప్, వరల్డ్‌కప్‌లలో రోహిత్‌కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్‌కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్‌మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్‌కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి రాహుల్‌ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
WC 2023: వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ అతడే! కానీ..
ICC ODI World Cup 2023- Team India Opening Slot: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన ఈ వికెట్ కీపర్ వన్డే వరల్డ్‌కప్-2023లో భారత జట్టులో కీలకం కానున్నాడని అభిప్రాయపడ్డాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటి టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గురిపెట్టాడని పేర్కొన్నాడు. అయితే, డబుల్ సెంచరీ సాధించిన సంతోషంలోనే ఉండిపోకూడదని.. ఎప్పుటికప్పుడు ఆట తీరును మరింత మెరుగుపరచుకోవాలని బ్రెట్ లీ.. ఇషాన్‌కు సూచించాడు. కాగా బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ద్విశతకం బాదిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ యువ బ్యాటర్. ఇక భారత్ వేదికగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇషాన్ ఈ మేరకు రాణించడం టీమిండియా ఓపెనింగ్ ఆప్షన్లను పెంచింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఓపెనర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘విధ్వంసకరమైన డబుల్ సెంచరీతో.. సొంతగడ్డపై 2023లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ స్థానానికి తాను గట్టిపోటీదారునని ఇషాన్ చెప్పకనే చెప్పాడు. ఒకవేళ తనే ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా? ఏమో నాకైతే తెలియదు కాదు. మరి ఇలా జరగాలా అంటే మాత్రం కచ్చితంగా జరగ్సాలిందే! వన్డే చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడి గురించి ఇంకేం చెప్పగలం. గర్వం వద్దు తను ఫిట్నెస్ కాపాడుకుంటూ, నిలకడైన ఆట తీరు కనబరిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో టీమిండియా ఓపెనర్‌గా తన పేరు ఉండటం ఖాయం’’ అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. అయితే, తన అరుదైన రికార్డుల కారణంగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్.. గర్వాన్ని నెత్తికెక్కించుకోకూడదని సలహా ఇచ్చాడు. ‘‘తన మైలురాళ్ల గురించి ఇషాన్ మర్చిపోవాలి. ద్విశతకం తాలుకు ప్రశంసలను కూడా ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. నీ కోసం మరిన్ని మైల్‌స్టోన్స్ ఎదురుచూస్తున్నాయి. కాబట్టి.. నీకిచ్చే సలహా ఒకటే ఇషాన్.. నువ్వు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే గర్వం దరిచేయనీయకూడదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ బ్రెట్ లీ.. ఇషాన్‌కు సూచనలు చేశాడు. కాగా బంగ్లాదేశ్‌లో ప్రదర్శనతో శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు ఇషాన్ కిషన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇషాన్‌తో పాటు శుబ్‌మన్ గిల్ సైతం ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉన్నాడు. చదవండి: Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి! Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు! -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్‌గా సూర్యకుమార్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే కివీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు వన్డేలు ఆడనుంది. కాగా ఈ కివీస్ టూర్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. మరోవైపు రాహల్ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా తొలిసారి భారత టీ20 జట్టులో యువ ఆటగాడు శుబ్మాన్ గిల్‌కు చోటుదక్కింది. భారత ఓపెనర్లగా గిల్, సూర్య ఇక నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే టీ20 సిరీస్‌లో ఓపెనర్లుగా శుబ్మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌ను పంపాలని టీమిండియా మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా శుబ్మాన్ గిల్ వన్డేలతో పాటు ఐపీఎల్లో కూడా ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. ఇక సూర్య కూడా ఈ ఏడాది వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ జోడిగా బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చిన సూర్య పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: T20 WC 2022: బాబర్ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది! లేదంటే -
టీమిండియా ఓపెనర్‌గా అతడు వద్దు: గౌతం గంభీర్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసియాకప్-2022తో తిరిగి గాడిలో పడ్డాడు. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన విరాట్.. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. అదే విధంగా దాదాపు 1000 రోజుల తర్వాత తన 71వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో ఓపెనర్ వచ్చిన కింగ్ కోహ్లి.. దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 122 పరుగులు సాధించి ఆజేయం నిలిచాడు. దీంతో టీ20ల్లో భారత ఓపెనర్‌గా కోహ్లిని పంపించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మాత్రం కోహ్లిని ఓపెనర్‌గా పంపాలన్న చర్చలను కొట్టిపారేశాడు. విరాట్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానమే సరైనది అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్‌ప్లాన్'లో భాగంగా గంభీర్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి భారత బ్యాకప్ ఓపెనర్ మాత్రమే. కోహ్లిని ఓపెనర్‌గా పంపించాలన్న కొత్త చర్చలను ప్రారంభించవద్దు. జట్టులో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఉంటే విరాట్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే సరిపోతుంది. ఒక వేళ ఓపెనర్లు 10 ఓవరర్ వరకు బ్యాటింగ్ చేస్తే.. అప్పుడు మూడో స్థానంలో కోహ్లికి బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను పంపించాలి. సూర్య దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును మరింత పరుగులు పెట్టిస్తాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
టీమిండియా ఓపెనర్లు ఎవరు.. ? పాక్ విలేకరికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన హిట్‌మ్యాన్
Rohit Sharma: పాకిస్థాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగనున్న హై ఓల్టేజీ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరనే అంశంపై పాక్ జర్నలిస్ట్ వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నను తనదైన శైలిలో సమాధానమిస్తూ హుషారుగా కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా భారత ఓపెనింగ్ జోడిపై పాక్ జర్నలిస్ట్ హిట్‌మ్యాన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించాడు. గత కొంతకాలంగా టీమిండియా ఓపెనర్లను వరుసగా మారుస్తూ వస్తుంది. ఈ మ్యాచ్‌తోనైనా ఆ ప్రయోగాలకు పుల్‌స్టాప్ పెడతారా..? లేక అదే ధోరణిని కంటిన్యూ చేస్తారా..? అని సదరు విలేకరి రోహిత్‌ను అడిగాడు. ఇందుకు హిట్‌మ్యాన్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. తొందరెందుకు.. టాస్ వేశాక మీరే చూస్తారుగా అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉండడం తమ జట్టుకు అవసరమంటూ కంక్లూడ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ
Rohit-Dhawan: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు మరో అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఈ ద్వయం మరో 43 పరుగులు జోడిస్తే.. విండీస్ దిగ్గజ ఓపెనర్ల రికార్డును అధిగమిస్తారు. వన్డేల్లో విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ జోడీ తొలి వికెట్‌కు 102 ఇన్నింగ్స్‌ల్లో 5150 పరుగులు జోడించగా.. రోహిత్-ధవన్ జోడీ 112 ఇన్నింగ్స్‌ల్లో 5108 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో నేటి (జులై 14) మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ ద్వయం మరో 43 పరుగులు సాధించగలిగితే.. వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ (136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472) రెండో ప్లేస్‌లో నిలిచింది. తొలి వన్డేలో హిట్‌మ్యాన్- ధవన్ పెయిర్ తొలి వికెట్‌కు అజేయమైన 114 పరుగులు సాధించడం ద్వారా ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇదిలా ఉంటే, తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 110 పరుగులకే చాపచుట్టేసింది. ఛేదనలో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. చదవండి: విండీస్‌తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్ -
'ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి'
ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా తరపున వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని భారత మాజీ ఆటగాడు వివి రామన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2021లో కేకేఆర్ తరపున అదరగొట్టిన వెకంటేష్ అయ్యర్‌కు.. అదే ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో అయ్యర్ పర్వాలేదనపించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయ్యర్ తీవ్రంగా నిరాశ పరిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు అయ్యర్‌కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. కాగా ప్రోటీస్ సిరీస్‌లో అయ్యర్ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌లోనైనా భారత తుది జట్టులో అయ్యర్‌కు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 ఆదివారం(జూన్26) డబ్లిన్ వేదికగా జరగనుంది. "కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం ఇస్తే బాగుటుంది. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌ల నుంచి బెంచ్‌కే పరిమితమవుతున్నారు. అటువంటి ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. ఇక వెంకటేష్ అయ్యర్ గత కొంత కాలంగా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి తగినన్ని అవకాశాలు లభించడం లేదు. కాబట్టి ఈ సిరీస్‌లో అతడికి టీమిండియా తరపున ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి" అని రామన్ పేర్కొన్నారు. చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..! -
‘ఆరంభం’ మారాలి!
సాక్షి క్రీడా విభాగం కొన్నాళ్ల క్రితం శిఖర్ ధావన్, రోహిత్ శర్మల ఓపెనింగ్ జోడి అందించిన అద్భుత విజయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వరుసగా భారీ భాగస్వామ్యాలతో ఈ ఇద్దరు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో జట్టు గెలుపు కోసం బాట పరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుడి, ఎడమ చేతివాటం కాంబినేషన్‌తో సెహ్వాగ్, గంభీర్‌లను మరిపించి వీరు తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఈ జోడి ఆటతోనే చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ తర్వాత వరుసగా మరో మూడు టోర్నీల్లో భారత్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జోరు తగ్గింది. ఏ జట్టు విజయానికైనా చుక్కానిలాంటి ఓపెనింగ్ ఇప్పుడు భారత్‌కు కొత్త సమస్యగా మారింది. ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఒక్కటీ నెలకొల్పకపోవడం టీమ్‌పై ప్రభావం చూపిస్తోంది. వ్యక్తిగతంగా చూసినా ధావన్, రోహిత్ ఒకరితో మరొకరు పోటీ పడి విఫలమవుతున్నారు. కివీస్‌తో జరిగిన గత రెండు వన్డేల్లో వీరిద్దరు కలిపి మొత్తం 125 బంతులు ఎదుర్కొని 69 పరుగులు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం కివీస్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం జరిగే మూడో వన్డే కోసం టీమిండియా ఓపెనింగ్‌లో మార్పులు చేస్తుందా, వీరినే కొనసాగిస్తుందా చూడాలి. పదే పదే అదే ఆట... ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన ఆఖరి వన్డేలో తొలి వికెట్‌కు ధావన్, రోహిత్ 112 పరుగులు జోడించారు. రోహిత్ డబుల్ సెంచరీ చేసిన ఈ మ్యాచ్ తర్వాత ఆరంభ జోడి ఆట గతి తప్పింది. ఆ తర్వాత జరిగిన ఏడు వన్డేల్లో వీరిద్దరు కలిసి వరుసగా 17, 21, 29, 14, 10, 15, 22 పరుగులు జత చేశారు. తాము ఓపెనర్లుగా బరిలోకి దిగిన తొలి 17 వన్డే మ్యాచుల్లో వీరు ఆరు సెంచరీ భాగస్వామ్యాలు, మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. దాంతో పోలిస్తే భారత ఓపెనింగ్ ఇప్పుడు సమస్యగానే మారిందనవచ్చు. పరుగులు రాకపోవడమే కాదు, ఓపెనర్లుగా వీరి ఆటతీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఇంగ్లండ్ గడ్డపై దూకుడైన ఆటతోనే సరిపెట్టకుండా చక్కటి షాట్ల ద్వారా పరుగులు రాబట్టారు. బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ సింగిల్స్, ప్లేసింగ్స్ ద్వారా స్కోరుబోర్డును పరుగెత్తించారు. అయితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో అది లోపించింది. ఇప్పుడు ప్రతీ బంతిని ఎదుర్కోవడంలో రోహిత్లో తడబాటు కనిపిస్తుండగా...అవసరం ఉన్నా లేకపోయినా మళ్లీ మళ్లీ ఒకే తరహా షాట్ ఆడి ధావన్ నిష్ర్కమిస్తున్నాడు. ఇక దక్షిణాఫ్రికాలో స్టెయిన్ బౌలింగ్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఆడిన రోహిత్ అయితే కివీస్ పరిస్థితుల్లో కూడా తడబడుతున్నాడు. తొలి వన్డేలో సౌతీ బౌలింగ్‌లో అతను వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఆడగా...రెండో మ్యాచ్‌లో కూడా భారత్ రెండు, మూడు ఓవర్లలో ఒక్క పరుగూ చేయలేదు. రాయుడును ఆడిస్తారా... మూడో వన్డేలో మార్పులకు అవకాశం ఉందని కెప్టెన్ ధోని ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడిలో మార్పు జరగవచ్చు. రహానేను ఓపెనర్‌గా పంపి రోహిత్‌ను నాలుగో స్థానంలో ఆడించేందుకు అవకాశం ఉంది. రోహిత్‌కు కాస్త విరామం ఇవ్వాలని భావిస్తే మిడిలార్డర్లో రాయుడు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. వరుసగా రెండో పర్యటనలోనూ అతనికి ఒక్క మ్యాచ్ కూడా దక్కలేదు. చక్కటి స్ట్రోక్ మేకర్ అయిన రాయుడుకు అవకాశం కల్పించి అతని సత్తాను కూడా పరీక్షించవచ్చు. మరో వన్డే ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండటంతో ధోని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్నది ఆసక్తికరం.