Brett Lee: India's Sure-Shot Opener at 2023 World Cup - Sakshi
Sakshi News home page

WC 2023: వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌ అతడే! గర్వం తలకెక్కితే మాత్రం..

Published Wed, Dec 28 2022 11:03 AM | Last Updated on Wed, Dec 28 2022 12:32 PM

WC 2023 Brett Lee On India Star: Sure Shot Opener For At World Cup - Sakshi

ICC ODI World Cup 2023- Team India Opening Slot: టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన ఈ వికెట్‌ కీపర్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత జట్టులో కీలకం కానున్నాడని అభిప్రాయపడ్డాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటి టీమిండియా ఓపెనింగ్‌ స్థానానికి గురిపెట్టాడని పేర్కొన్నాడు.

అయితే, డబుల్‌ సెంచరీ సాధించిన సంతోషంలోనే ఉండిపోకూడదని.. ఎప్పుటికప్పుడు ఆట తీరును మరింత మెరుగుపరచుకోవాలని బ్రెట్‌ లీ.. ఇషాన్‌కు సూచించాడు. కాగా బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ద్విశతకం బాదిన ఇషాన్‌ కిషన్‌.. పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ యువ బ్యాటర్‌. ఇక భారత్‌ వేదికగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న  నేపథ్యంలో ఇషాన్‌ ఈ మేరకు రాణించడం టీమిండియా ఓపెనింగ్‌ ఆప్షన్లను పెంచింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఇషాన్‌ కిషన్‌

విధ్వంసకర ఓపెనర్‌
తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘విధ్వంసకరమైన డబుల్‌ సెంచరీతో.. సొంతగడ్డపై 2023లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఓపెనింగ్‌ స్థానానికి తాను గట్టిపోటీదారునని ఇషాన్‌ చెప్పకనే చెప్పాడు.

ఒకవేళ తనే ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా? ఏమో నాకైతే తెలియదు కాదు. మరి ఇలా జరగాలా అంటే మాత్రం కచ్చితంగా జరగ్సాలిందే! వన్డే చరిత్రలో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడి గురించి ఇంకేం చెప్పగలం.

గర్వం వద్దు
తను ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ, నిలకడైన ఆట తీరు కనబరిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులో టీమిండియా ఓపెనర్‌గా తన పేరు ఉండటం ఖాయం’’ అని బ్రెట్‌ లీ చెప్పుకొచ్చాడు. అయితే, తన అరుదైన రికార్డుల కారణంగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్‌.. గర్వాన్ని నెత్తికెక్కించుకోకూడదని సలహా ఇచ్చాడు.

‘‘తన మైలురాళ్ల గురించి ఇషాన్‌ మర్చిపోవాలి. ద్విశతకం తాలుకు ప్రశంసలను కూడా ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. నీ కోసం మరిన్ని మైల్‌స్టోన్స్‌ ఎదురుచూస్తున్నాయి.

కాబట్టి.. నీకిచ్చే సలహా ఒకటే ఇషాన్‌.. నువ్వు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే గర్వం దరిచేయనీయకూడదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌ లీ.. ఇషాన్‌కు సూచనలు చేశాడు. కాగా బంగ్లాదేశ్‌లో ప్రదర్శనతో శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు ఇషాన్‌ కిషన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇషాన్‌తో పాటు శుబ్‌మన్‌ గిల్‌ సైతం ఓపెనింగ్‌ స్థానానికి పోటీలో ఉన్నాడు.

చదవండి: Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరి!
Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్‌ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement