
ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా తరపున వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని భారత మాజీ ఆటగాడు వివి రామన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2021లో కేకేఆర్ తరపున అదరగొట్టిన వెకంటేష్ అయ్యర్‌కు.. అదే ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో అయ్యర్ పర్వాలేదనపించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్ తీవ్రంగా నిరాశ పరిచాడు.
అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు అయ్యర్‌కు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. కాగా ప్రోటీస్ సిరీస్‌లో అయ్యర్ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌లోనైనా భారత తుది జట్టులో అయ్యర్‌కు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 ఆదివారం(జూన్26) డబ్లిన్ వేదికగా జరగనుంది.
"కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం ఇస్తే బాగుటుంది. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌ల నుంచి బెంచ్‌కే పరిమితమవుతున్నారు. అటువంటి ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. ఇక వెంకటేష్ అయ్యర్ గత కొంత కాలంగా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి తగినన్ని అవకాశాలు లభించడం లేదు. కాబట్టి ఈ సిరీస్‌లో అతడికి టీమిండియా తరపున ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి" అని రామన్ పేర్కొన్నారు.
చదవండి: ENG vs NZ: టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..!