టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తాచాటుతున్నాడు.
ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు.
"హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.
కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్‌కు ఐపీఎల్ తర్వాత వరల్డ్‌కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment