దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైర‌ల్‌ | Mumbai fan apologises to Hardik Pandya after T20 World Cup heroics | Sakshi
Sakshi News home page

T20 WC: దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైర‌ల్‌

Published Thu, Jul 4 2024 7:47 PM | Last Updated on Thu, Jul 4 2024 8:13 PM

Mumbai fan apologises to Hardik Pandya after T20 World Cup heroics

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బోడస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘనస్వాగతం పలికారు. 

ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లే అంతవరకు జేజేలు కొడుతూ అభినందించారు.  ఇప్పుడు ముంబై వంతు. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభమైంది. క్రికెట్ అభిమానుల‌తో ముంబై తీరం పోటెత్తింది. 

తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమ‌న్ పాయింట్ నుంచి వాంఖ‌డే స్టేడియం వరకు  ఓపెన్ బస్ విక్టరీ పరేడ్​ జరగనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్‌కు సన్మానం జరగనుంది.

హార్దిక్‌కు సారీ చెప్పిన అభిమాని
ఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐపీఎల్‌-2024లో సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. 

భార‌త ఆట‌గాళ్ల స‌న్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్య‌లో అభిమానులు వాంఖ‌డే స్టేడియంకు త‌ర‌లివ‌చ్చారు. హార్దిక్ హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ఓ  మ‌హిళా అభిమాని లైవ్‌లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది.

"మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్‌లో నేను కూడా అత‌డిని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాను. అత‌డు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో హీరోగా మారాడు. అత‌డు వేసిన చివ‌రి ఒక అద్భుతం. అత‌డికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని" సద‌రు అభిమాని  ఇండియా టూడేతో పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement