టీ20 వరల్డ్‌కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది.
ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది.
దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.
ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..
ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.
వర్షం అంతరాయం..
ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment