ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జూలు విధిల్చింది. తొలి రెండు టెస్టుల్లో విజయాలను నమోదు చేసిన కివీస్‌కు ఓటమి రుచి చూపించేందుకు భారత జట్టు సిద్దమైంది.
రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశారు. బంతిని గింగరాల తిప్పుతూ కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా, అశ్విన్ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఛేజింగ్ అంత ఈజీ కాదు..
ఇక కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా ఒక్క వికెట్ పడగొట్టాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్, ఓ రూర్కీ ఉన్నారు. త్వరగా వికెట్ పడగొట్టి 150 పరుగుల ఆధిక్యంలోపు కివీస్‌ను కట్టడి చేయాలని టీమిండియా భావిస్తోంది.
అయితే వాంఖడేలో 150 పరుగుల లక్ష్యం చేధన కూడా అంత సులువు కాదు. ఎందుకంటే వాంఖడే పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంటాయి. వాంఖడే వికెట్ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది.
అంతేకాకుండా బంతి కూడా ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశముంది. కాగా ఇటీవల కాలంలో స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కివీస్ స్పిన్నర్లు చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్, ఇష్ సోధీ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. భారత్ సునాయసంగా లక్ష్యాన్ని చేధించాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. రోహిత్ శర్మ, జైశ్వాల్ కచ్చితంగా తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిందే.
అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఎంతంటే?
ఇక వాఖండేలో విజయవంతమైన అత్యధిక ఛేదన 163 పరుగులు. 2000లో భారత్ నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
చివరగా 2021లో 540 పరుగుల లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది. అంతకంటే ముందు 2013లో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 187కే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
2004లో ఆస్ట్రేలియా 107 పరుగులను ఛేదించలేక 93 రన్స్‌కే కుప్పకూలింది. స్పిన్నర్ల వలలో చిక్కుకుని కంగారులు విల్లవిల్లాడారు. ఈ వేదికలో టీమిండియాకు కూడా ఓసారి ఘోర పరభావం ఎదురైంది. 2006 ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 313 పరుగుల ఛేదనలో 100 పరుగులకే కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment